Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎనోబార్బస్ : అయితే మీ ఇష్టంవచ్చినట్లు జరిగించండి. ఆలోచించినా పైకి ఏమీ అనక శిలనై ఉంటాను.

సీజర్ : అతడు చెప్పిన విషయాలను గురించి నాకెట్టి అసంతృప్తి కలగలేదు. అయితే అతనిరీతిలో కొంత స్వేచ్ఛ మాత్రం కనిపించింది. మన ఇరువురి స్వభావాలూ అన్యోన్యవ్యతిరిక్తాలై వ్యవహరిస్తున్నవి. కానీ ఏ బంధం వల్ల మన ఇరువురి స్నేహం సుస్థిరంగా నిరంతరం నిలువగలుగుతుందో దానికోసం ప్రపంచంలోని నలుమూలలా నేను అన్వేషిస్తాను.

అగ్రిప్పా : సీజర్ మహాశయా! ఇంచుక నాకు అవకాశమీయండి.

సీజర్ : అగ్రిప్పా! నీవు ప్రసంగించవచ్చు.

అగ్రిప్పా : మీకు తల్లివంక చెల్లెలు న్నది. ఆమె ప్రశస్తిగన్నది. ఆంటోనీ ఇప్పుడు విధురుడు.

సీజర్ : అలా అనకు అగ్రిప్పా! నీ మాటలు క్లియోపాత్రా వింటే నీ తొందరపాటుకు.ఆమె నిన్ను తిట్టిఉండేది. ఆ తిట్లకు నీవు యోగ్యుడవౌతావు కూడాను.

ఆంటోనీ : సీజర్! ప్రస్తుతం నేను అవివాహితుడనే. అగ్రిప్పాను ఇంకా విశదంగా మాట్లాడనివ్వండి.

అగ్రిప్పా : నిరంతరసఖ్యంతో మీ ఇరువురినీ నిలపటానికి, భ్రాతలనుగా ఇరువురినీ బంధించటానికీ, జారిపోని ముడివేసి మీ ఇరువురి హృదయాలనూ కలిపి కట్టివేయటానికీ ఆంటోనీ మహాశయా! నీవు ఆ ఆక్టేవియాను భార్యగా స్వీకరించు. ఆమె పురుషశ్రేష్ఠుణ్ణి భర్తగా పడయదగినంతటి పరమసుందరి. ఆమె శీలసౌభాగ్యం 35, సౌందర్యవిశేషం ఆమెను గురించి మిగిలినవాటి కంటే విశేషంగా చెప్ప సమర్థాలైనవి. ఈ నాడు మహాఘనాలుగా కన్పించే అల్పవైమనస్యాలు, ప్రమాదపరిస్థితులను వెంటబెట్టుకొని ఉన్నట్లు కన్పించే గాఢభయాలు ఈ వివాహంవల్ల మటుమాయ మౌతాయి. కల్పితకథలు ఈ నాడు సత్యాలౌతున్నాయి. అతిసత్యాలే ఈ వివాహం జరిగిననాడు కథలౌతాయి. ఆమె మీది మీ ప్రేమ మీ ఇరువురిని పరస్పరం ఆకర్షిస్తుంది. ఇరువురినీ ఆమెయెడ అనురాగపూరితులను చేస్తుంది. నేను విన్నవించేదానిలో ఏమైనా.దోషముంటే క్షమించండి. ఇది ఏదో హఠాత్తుగా తోచిన ఊహ కాదు యోచనచేసి పొందిన అభిప్రాయం. ఇది నా కర్తవ్యానుపాలనంగా తోచి మనస్సులో బహుకాలం.మెలిగిన అభిప్రాయం.


202

వావిలాల సోమయాజులు సాహిత్యం-3