సీజర్ : అవసరమైనపుడు నాకు శస్త్రాలనూ, సహాయాన్నీ ఇవ్వటమనే ఆ రెంటినీ నీవు తిరస్కరించావు.
ఆంటోనీ : ఇవ్వలేకపోయాననటం సమంజసం. విలాసప్రియత్వం నా జ్ఞాపకశక్తిని దోచుకొని, నా ఔదార్యాన్ని తనకు బానిసను చేసుకొన్నది. ఆ కాలంలో నేను మీకు తోడ్పకలేకపోయినాను కనుక ఇవ్వలేకపోయినాననటం సమంజసం. ఈ వ్యతిక్రమానికి, నాకు గౌరవలోపం కలగనంతటిమేరకు నేను నీ క్షమాపణను అర్థిస్తున్నాను. అయితే ఈ అభ్యర్థనవల్ల నా సత్యరతికి, అధికారానికీ దారిద్ర్యావమానాలను కల్పించడం నేను అంగీకరించను. అవి లేనిది నేను వ్యవహరించలేను. ఇందులోని సత్యం ఇది . ఫుల్వియా నన్ను ఈజిప్టు నుంచి రప్పించటానికి ఇక్కడ యుద్ధాలు చేసింది. అజ్ఞాతంగానే నేను వాటికి కారణమైనాను. నా గౌరవానికి భంగం కలగనిరీతిగా ఇందుకు నేను మీకు క్షమాపణ చెప్పుకొంటున్నాను.
లెపిడస్ : మహోదాత్తంగా పలికావు.
మెకన్నాస్ : మీలో ఒకరివల్ల ఒకరికి పూర్వం కలిగిన కష్టనష్టాలను గురించి పట్టుపట్టవద్దని నేను సూచించవచ్చుననుకొంటాను. వాటిని మరిచిపోగలిగితే, మీరు ఇరువురూ ప్రస్తుతావసరాలు మీ ఇద్దరి సఖ్యాన్ని ఎంత ఘనంగా కోరుతున్నవో గమనించినవారౌతారు.
లెపిడస్ : నీవు అవసరానికి ఎంతో అనుయోగ్యంగా ప్రసంగించావు మెకన్నాస్!
ఎనోబార్బస్ : లేదా ఇప్పుడు పరస్పరానురాగాన్ని తాత్కాలికంగా మీరు అరువు పుచ్చుకొంటే, పాంపేను గురించిన మాటలు వినపడటం మానేసిన తరువాత, మళ్లీ మీ వైమనస్యాలను త్రవ్వుకోవచ్చు. మీకప్పుడు మరోపని ఉండదు గనుక, కలహించుకోటానికి కావలసినంతగా కాలం ఉంటుంది కూడాను.
ఆంటోనీ : నీవు కేవలం ఒక సైనికుడివి. ఇక విస్తరించి సంభాషించకు.
ఎనోబార్బస్ : సత్యం కూడా మూకత వహించవలసిన సమయాలు ఉంటాయని నేను పూర్తిగా మరిచిపోయాను.
ఆంటోనీ : ఈ సమావేశానికి నీవు పూర్తిగా అపచారం చేస్తున్నవాడి వౌతున్నావు. కనుక ఇక నీవు నోట మాట రానీయకు!
ఆంటోని - క్లియోపాత్రా
201