Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మెనెక్రేటిస్ : ప్రభూ! నేను దీన్ని సిల్వియస్ వల్ల విన్నాను.

పాంపే : అతడు కలలు గంటున్నాడు. అంతే. వాళ్ళిద్దరూ రోములో అంటోనీకోసం ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు. ఓ బంధకీ, క్లియోపాత్రా! తొలినాటి కోమలత్వాన్ని కోల్పోయిన నీ అధరానికి సర్వసమ్మోహనవిద్యలూ నవరాగరేఖలు ప్రసాదించుగాక! నీ మాంత్రిక కర్మకౌశలం సౌందర్యంతో నిత్యసాంగత్యాన్ని పొందుగాక! నీవా శృంగారలోలుపుణ్ణి కామకదన భూమిలో కట్టిపడెయ్. మద్యపానీయాలతో అతని మతికి మత్తెక్కించు. ఎపిక్యురస్ 30 మతానుయాయులైన బానిసీండ్రు తృప్తి అందని రుచులను కల్పించి అతని క్షుధాగ్నిని నిరంతరం రగుల్కొల్పెదరుగాక! తన గౌరవాన్ని పునరుద్ధరించుకోలేని రీతిగా దీర్ఘనిద్ర, అతిభోజనం అతనికి విస్మృతివంటి మాంద్యాన్ని కలిగించుగాక! వర్రియస్! విశేషాలేమిటి?

వర్రియస్ ప్రవేశిస్తాడు

వర్రియస్ : నన్నెందుకు నియోగించారో ఆ వార్తలు చెప్పక తప్పదు. మార్క్ ఆంటోనీ ఏ మడియనైనా రావచ్చునని రోములో నిరీక్షిస్తున్నారు. ఆయన ఈజిప్టులో బయలుదేరినప్పటినుంచీ, అక్కడినుంచి రోముకు రావటానికి పట్టే కాలంకంటే ఎంతో అదనంగా గడిచిపోయింది.

పాంపే : ఇంతకంటే అల్పప్రాముఖ్యమున్న మరో అంశాన్ని దేన్నయినా ఎక్కువ శ్రద్ధతో వినేవాణ్ణి. ఈ స్వల్పయుద్ధంకోసం ఆ శృంగారలోలుడు కవచధారణం చేస్తాడని కలలోనైనా నేననుకోను. అయితే అతని యుద్ధపాండిత్యం వీరిరువురి విజ్ఞానం కంటే రెండింతలు విశేషమైంది. నా విప్లవం కల్పించిన కల్లోలం అంటోనీని ఆ ఈజిప్టు విగతభర్తృక ఉత్సంగంనుంచి ఊడబెరికి బయటపడవేసినందుకు, నన్ను గురించిన నెంతగానో గౌరవభావాన్ని వహించటం సమంజసం.

మెనాస్ : సీజర్, ఆంటోనీ సక్రమంగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలుపుకొంటారని నేనూహించను. మరణించిన ఆ ఆంటోనీ భార్య సీజర్మీద ఎదురుతిరిగింది. అతనిచేత ప్రేరేపితుడైనవాడు కాడని నాకు తెలుసును కానీ ఆంటోనీ సోదరుడు సీజర్ మీద యుద్ధం చేశాడు.


196

వావిలాల సోమయాజులు సాహిత్యం-3