ద్వితీయాంకం
ఒకటో దృశ్యం
మెస్సినా. పాంపే గృహం. మెనెక్రేటిస్, మెనాస్ యుద్ధోచితవేషంతో ప్రవేశిస్తారు.
పాంపే : దేవతలు సత్యప్రియులే ఐతే జీవితమార్గాలలో సత్యరతులైనవారు పూనుకొన్న సత్కార్యాలకు తోడ్పడి తీరాలి.
మెనెక్రేటిస్ : యోగ్యుడా, పాంపే! వారు సాయపడటంలో ఇంచుక కాలవిలంబం చేస్తారేగాని తోడ్పాటును తిరస్కరించరని తెలుసుకో.
పాంపే : ఒకదానికోసం మనం నిరంతరం అభ్యర్థింపవలసివస్తే అది దాన్ని మూల్యాన్ని కోల్పోతుంది.
మెనెక్రేటిస్ : బహుసందర్భాలలో ఏది మనకు మేలును చేకూరుస్తుందో తెలుసుకోలేక కీడును కల్గించే దానికోసం మనం దేవతలను ఆర్థిస్తుంటాము. ఈ కారణాన వారిని అర్థించేవాటిని పొందకపోవటంవల్లనే మనకెంతో లాభం చేకూరుతుంది.
పాంపే : పరంపరాభివృద్ధిని నేను పొందితీరుతాను. తప్పదు. ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు సముద్రాధిపత్యం నాది. నా అధికారం నేడు సక్రమంగా సర్వకళలనూ సంపాదిస్తున్నది. అనతికాలంలోనే అది కళాపరిపూర్ణబింబం కాగలదని నా ఆశ జోస్యం చెబుతున్నది. ఆంటోనీ ఈజిప్టులో మాంసకుంభాల మధ్య తిష్ఠన్మూర్తియై తిరుగులేకుండా ఉన్నాడు. ఆ దేశద్వారాలను దాటివచ్చి అతడు యుద్ధం చెయ్యడు. ధనసంపదలను కుప్పలు పోసుకొంటున్నాడే కాని, సీజర్ ప్రజాహృదయాలను పోగొట్టుకొంటున్నాడు. ఇరువురికీ తన స్తోత్రాలు వినిపిస్తూ ఇరువురి స్తుతులనూ తానువింటున్నాడు లెపిడస్. అయితే అతడికి ఇరువురిమీదా అనురాగం లేదు. అంతేకాదు. ఆ ఇరువురూ అతణ్ణి పరిగణించరు కూడాను.
మెనెక్రేటిస్ : సీజర్, లెపిడస్ ఇరువురూ సిద్ధపడి యుద్ధభూమిలో నీకు ఎదురునిల్చారు. వారివెనుక బలవత్తరమైన సైన్యం నిలిచిఉంది.
పాంపే : నీ కీవార్త ఎలా వచ్చింది? ఇది అబద్ధం!
ఆంటోని - క్లియోపాత్రా
195