క్లియోపాత్రా : అయ్యో! నా వలె ఇంతటి మహత్తరమైన మోసానికి పాలైన మహారాజ్ఞి మరొకతె లేనే లేదు. అయినా నా మీద పన్నబడ్డ పన్నాగం నాకు మొదటినుంచీ తెలుసు.
ఆంటోనీ : క్లియోపాత్రా
క్లియోపాత్రా : ఫుల్వియాను మోసగించటాన్ని కళ్లారా చూచిన సింహా నస్థులైన దేవతలనే నీ ప్రణామాలతో చిత్తక్షోభం కల్పించగలిగిన నీవు నా వాడవనీ, నా యెడ సత్యసంధుడిపై వర్తిస్తావని నేను ఎందుకు భావించాలి? పలికేటప్పుడే పాటించటానికి ఉద్దేశింపబడని శూన్యప్రమాణాలనే వాగురులలో చిక్కుకోపోవటం కేవలం ఒక ఉన్మాదకృత్యం.
ఆంటోనీ : మధురతమా! రాజ్జీ!!
క్లియోపాత్రా : వద్దు. వద్దు. నిన్ను ప్రార్థిస్తున్నాను. వెళ్లిపోవటానికి సాకు వెదకవద్దు. వీడ్కోలు వాక్యాలు పల్కి వెళ్లిపో, ఇక్కడ ఉంటానికి నీవు నన్ను ప్రార్థించినప్పుడు అది మధుర ప్రసంగాలకు మనోజ్ఞమైన కాలం. వెళ్ళటమనే ప్రశ్నే అప్పుడు లేదు. మన అధరాలు, నేత్రాలు అప్పుడు నిత్యప్రణయైక జీవితానికి నిలయాలైనవి. ధనురాకృతులైన మన కనుబొమలు కమనీయా నందమందిరాలైనవి. స్వర్గ సౌరభ్యసంవాసితం కాకుండా మన ఏ క్షుద్రావయవం కూడా ఆ నాడు నిలువ లేకపోయింది. అయితే అవి ఈ నాడూ అలాగే ఉన్నాయి. కానీ నీవు, ప్రపంచ ప్రథమయోధుడవైన నీవు, లోకోత్తరుడవైన సత్యవాదివిగా పరవర్తన పొందావు.
ఆంటోనీ : ప్రియరాజ్జీ! ఏమిటిది?
క్లియోపాత్రా : నీ ఆకృతిప్రమాణాలు నాకుండి ఉండవలసింది అప్పుడు ఈజిప్టులో ధైర్యసాహసాలుగల ఒక హృదయం ఉందని నీకు తెలిసి ఉండేది.
ఆంటోని: ప్రియరాజ్జీ! నా పలుకు విను. వర్తమానకాలంలోని అత్యావశ్యకాలైన వ్యవహారాలు నా సేవలను అపేక్షించి ఆజ్ఞాపిస్తున్నాయి. కానీ ప్రణయపూరితమైన నా హృదయం నిరంతరం నిన్నే నమ్మి నీ సన్నిధానంలోనే ఉంటుంది. మా ఇటలీ అంతర్యుద్ధ శస్త్రకాంతులతో ఆచ్ఛాదితమైంది. సెక్స్టస్ పాంపే రోముద్వాఃకవాటాలను చేరుకొంటున్నాడు. దేశీయాలే అయిన రెండు బలాల సమప్రాధాన్యం పరస్పర శంకాసంకులితాలైన కూటాలను సృష్టిస్తున్నది. ఒకనాడు అసహ్యించుకోబడ్డ పక్షం బలాన్ని కూర్చుకోవటం వల్ల క్రొత్తగా ప్రీతిపాత్రమౌతున్నది. ఒకనాడు పరిహృతుడైన 16 పాంపే పితృగౌరవసంపన్నుడై వర్తమానకాలంలో వైభవవిఖ్యాతులెవ్వరూ పొందజాలని
ఆంటోని - క్లియోపాత్రా
185