Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఛార్మియన్ : రాజ్జీ! నీవు ఆయన్ను మనసారా ప్రేమిస్తే", ప్రేమిస్తున్నావని నేననుకోను, ఆయనలో కూడా అటువంటి ప్రేమను జనింపజేయటానికి యోగ్యమైన మార్గాన్ని నీవు అనుసరించటం లేదు.

క్లియోపాత్రా : అయితే నేను చేయవలసిందేమిటి? చేయకూడనిదేమిటి?

ఛార్మియన్: సర్వవిషయాల్లోనూ ఆయనకు లొంగిపో. ఎందుకూ అభ్యంతరం చెప్పకు.

క్లియోపాత్రా : నీవు నాకు హీనబుద్ధివై బోధిస్తున్నావు. ఆయన్ను కోల్పోవటానికి నీ మార్గం మహా మంచిది.

ఛార్మీయన్ : అంత అధికంగా ఆయన్ను వ్యతిరేకించవద్దు. ఉద్రేకాన్ని కల్పించే విషయంలో నీవు కొంత సహనం చూపించాలి. అడుగో, ఆంటోనీ ఇక్కడికే వస్తున్నారు.

ఆంటోనీ ప్రవేశిస్తాడు.

క్లియోపాత్రా : నేను జబ్బుపడి కసరుబోతునైనట్టు నటించదలిచాను.

ఆంటోనీ : బొద్దు పాఠ్యంక్షమించాలి. నా ఉద్దేశాలను మీకు తెలియజేయవలసి ఉంది.

క్లియోపాత్రా : ఛార్మియన్, ఎక్కడున్నావు? శయ్య దగ్గరికి నన్ను తీసుకో పో. ఈ దీర్ఘవేదనను బహుకాలం తట్టుకోటం నాకు సాధ్యం కాని పని. నా శరీరం ఈ స్థితిని ఎంతకాలమని భరిస్తుంది? నేను తూలిపడేట్లున్నాను.

ఆంటోనీ : ప్రియరాజ్జీ!

క్లియోపాత్రా : నాకు దూరంగా నిలవండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

ఆంటోనీ : ఎందువల్ల? విషయమేమిటి?

క్లియోపాత్రా : మీకో శుభవార్త వచ్చిందని ఆయా చూపులవల్లనే తెలిసిపోతున్నది. మిమ్మల్ని పెళ్లాడిన ఆమె ఏమంటున్నది? ఆమె దగ్గరికి మీరు వెళ్లవచ్చు. ఆమె మీరిక్కడికి రావటానికే అంగీకరించకుండా ఉండిఉన్నట్లయితే ఎంతో బాగుండేది. నేనిక్కడ మిమ్మల్ని నిలిపివేస్తున్నానని ఆమె నన్ను గురించి ఏమీ అనకూడదు సుమా! మీ మీద నాకేమధికారముంది? మీరు ఆమెవారు. కేవలం ఆమెవారే!

ఆంటోనీ : దేవతలకిది బాగా తెలుసు.


184

వావిలాల సోమయాజులు సాహిత్యం-3