ఈజిప్టును వదలి వెళ్ళటానికి గల కారణాన్ని నేను రాత్రికి నివేదించి, వెంటనే ప్రయాణం చేయటంకోసం ఆమె అనుమతిని పొందుతాను. రోముకు నన్ను రమ్మని పిలిచేది. కేవలం ఫుల్వియా మరణమే కాదు మా వ్యక్తిగతవ్యవహారాలు కూడా ఉన్నాయి. మన సంక్షేమాన్ని అభిలషించి అతిరహస్యంగా అక్కడ వ్యవహరిస్తున్న మిత్రుల ఉత్తరాలు కూడా ఇంటికి తిరిగి రమ్మని నన్ను త్వరపెడుతున్నవి. సీజర్ను త్రోసిరాజని సెక్స్టస్ పాంపే " సముద్రాలమీద సర్వాధికారి అయికూర్చున్నాడు.
ఇక మన ప్రజలో? బలహీనులు చపలచిత్తులు. ప్రాభవాన్నంతటినీ కోల్పోయిన తరువాతగాని యోగ్యుడి మీద వారిప్రేమ స్థిరపడదు. ఘనుడైన పాంపే పుత్రుడి ఎడ వారు, అతనికి తండ్రికున్న సద్గుణాలన్నీ ఉన్నవని హఠాత్తుగా గుర్తించి, సమస్త.గౌరవాలనూ ప్రదర్శిస్తున్నారు. అందువల్లనే కీర్తిలోను, అధికారంలోను, అంతశ్శక్తి సామర్థ్యాలలోనూ సెక్స్టస్ పాంపే అత్యధికుడై యోధాగ్రేసరుల్లో ప్రథమగణ్యుడైనాడు. ఆ వ్యక్తి విశేషం ఈ రీతిగా సర్వప్రపంచాన్నీ ఆవరించటం లోకానికి మహోపద్రవం..సహజంగా అది విషపూరితం కావటంవల్ల ప్రస్తుతకాలం కల్పిస్తున్న ప్రళయాన్ని సకాలంలో ఎదుర్కోకపోతే అశ్వజాతి కేశాలలాగా " అతిప్రమాదకారి అయి తీరుతుంది..నా క్రింది ఉద్యోగులందరికీ మనం అతివేగంగా ఈ దేశాన్ని విడిచివెళ్ళటం నా. అభిలాషైనట్లు తెలియజెయ్
మూడో దృశ్యం
అదే ప్రదేశం. మరో కక్ష్య. క్లియోపాత్రా,
ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్ ప్రవేశిస్తారు.
క్లియోపాత్రా : ఆయనెక్కడున్నాడు?
ఛార్మియన్ : అప్పటినుంచీ నేను ఆయన్ను తిరిగి చూడలేదు.
క్లియోపాత్రా : ఎక్కడున్నాడో, వెంట ఎవరున్నారో, ఏం చేస్తున్నాడో చూడు. నిన్ను నేను పంపించానని ఆయనకు తెలియనీయకు. తీవ్రాలోచనానిమగ్నుడై ఉన్నట్లు కన్పిస్తే.నేను నృత్యం చేస్తున్నానని చెప్పు. వినోదిస్తుంటే హఠాత్తుగా నాకు సుస్తీ చేసిందని.చెప్పు. వెళ్లు. త్వరగా వెళ్లు. తక్షణం తిరిగి రా! (ఎలెగ్జాస్ నిష్క్రమిస్తాడు)
ఆంటోని - క్లియోపాత్రా
183