ఆంటోనీ : ఆమెను నేను చూడకుండా ఉన్నట్లయితే ఎంతో బాగుండేది.
ఎనోబార్బస్ : ఎంతమాటన్నారు ప్రభూ? ఆమెను మీరు చూచి ఉండకపోతే సృష్టిలోని ఒక అమూల్యకళాఖండాన్ని చూచి ఉండకపొయ్యేవారు. బహుదేశపర్యటనకు ప్రఖ్యాతిగన్న మీకు అది అపకీర్తికారణమై ఉండేది.
ఆంటోనీ : ఫుల్వియా మరణించింది.
ఎనోబార్బస్ : ప్రభూ, ఏమంటున్నారు?
ఆంటోనీ : ఫుల్వియా మరణించింది.
ఎనోబార్బస్ : ఏమిటి? ఫుల్వియా మరణించిందా? ఫుల్వియా?
ఆంటోనీ : అవును. మరణించింది.
ఎనోబార్బస్ : ఐతే కృతజ్ఞతాప్రదర్శకంగా దేవతలకు ఒక యాగాన్ని చేయించండి. ఎప్పుడు దేవతలు ఒక పురుషుడి భార్య ప్రాణాలను అపహరించటానికి ఇష్టపడతారో, అప్పుడు వారు భూలోకంలోని దర్జీలను పోలుతున్నారన్నమాట. పాత దుస్తులు జీర్ణమైతే కొత్తదుస్తులను కల్పించుకోటానికి అవసరమైన వస్తువులున్నాయనే ఊహను వారు కల్పిస్తున్నారు. ఫుల్వియా తప్ప ఇతరస్త్రీలు లేకపోతే ఇది మీకు గొప్పదెబ్బ గానీ, దారుణంగా దుఃఖింపదగినంతటి దుఃఖంగానీ అయి ఉండేది. ఇందువల్ల జీర్ణప్రాయమైన మీ కంచుకం తొలగిపోయి క్రొత్తది లభిస్తున్నది. ఈ దుఃఖంలో కొంత సౌఖ్యం.సమాయత్తమై ఉందికూడాను. అందువల్ల మీరు అధికంగా దుఃఖించవలసిన అగత్యం.అంతగా లేదు. అయితే ఒకవేళ మీరు దుఃఖించవలసిన అవసరముంటే కంటికి నీరు రావటానికని ఒక ఉల్లిగడ్డను వాసన చూడండి.
ఆంటోనీ : ఇటలీలో ఆమె ఆరంభించిన వ్యవహారాలు నేను ఇక అక్కడ లేకపోవటాన్ని.సహించవు.
ఎనోబార్బస్ : ఇక్కడ మీరు ఆరంభించిన వ్యవహారాలను మీరు లేకపోతే అంతకంటే.కొనసాగవు. అందులోనూ ముఖ్యంగా, మీరు ఇక్కడ నివసించటంమీదనే ఆధారపడ్డ క్లియోపాత్రా వ్యవహారం అణుమాత్రం ఆగలేదు.
ఆంటోనీ : ఎనోబార్బస్! తేలికగా ప్రసంగించటాన్ని ఇక చాలించు. నిర్వర్తించవలసిందని.నేను అభిలషించే అంశాలను మా ఉద్యోగులకు తెలియజెయ్. ఇంత త్వరితంగా
182
వావిలాల సోమయాజులు సాహిత్యం-3