క్లియోపాత్రా : ఆయనను నేను చూడనట్లు నటిస్తాను. నా వెంట మీరందరూ వచ్చేయండి.
(నిష్క్రమిస్తుంది)
ఒకవార్తాహరి, పరిచారకులూ వెంటరాగా ఆంటోనీ ప్రవేశిస్తాడు.
వార్తాహరి : తమ భార్య ఫుల్వియా" తొలుతగా యుద్ధరంగంలో ప్రవేశించింది.
ఆంటోనీ : నా సోదరుడు లూషియన్కు ప్రతర్ధినిగానా? వార్తాహరి : అవును. అయితే అనతికాలంలోనే వారి ఇద్దరిమధ్యా జరిగిన ఘోరమైన పోరు పరిసమాప్తమైంది. దేశంలోని విషమపరిస్థితులవల్ల ఇరువురికీ సఖ్యం కుదిరింది. ఉభయుల సేనలూ ఏకమై సీజర్ మీదికి ఎదురునడిచాయి. తొలి తుములంలోనే ఆయనకు లభించిన విజయం వారిని ఇటలీ నుంచి తరిమి వేసింది.
ఆంటోనీ : చెప్పవలసిన దుర్వార్తలు ఇంతకంటే ఇంకేమైనా ఉన్నాయా?
వార్తాహరి : వినిపించటానికి దుర్వార్తలను తెచ్చినవాడు వాటివల్ల కలిగే అసంతృప్తిలో పాలుపంచుకోవలసి ఉంటుంది.
ఆంటోనీ : ఆ వార్తలు ఒక బుద్ధిహీనుడికి లేదా పిరికిపందకూ సంబంధించినవైతే నీవు చెప్పేది సత్యమే. నీవు చెప్పవలసిందంతా వినిపించు. ఆపకు. జరిగిపోయిన విశేషాలేవీ నాలో సంచలనాన్ని కలిగించలేవు. నీవు చెప్పవలసిందంతా చెప్పేయి. ఒక వార్తాహరి చెప్పేది సత్యమైతే, అది మృత్యువు, భీకరమైన వార్తే అయినా నేను స్తోత్రపాఠాన్ని వినిపిస్తున్నప్పటి లాగానే వినగలను.
వార్తాహరి : అయితే వినండి. లెబినియస్, ఈ వార్త మహాపరుషమైంది. యూఫ్రెటిస్12 మొదలు ఆసియానంతటినీ తన పార్థియన్ సైన్యాలతో ఆక్రమించాడు. సిరియా మొదలు లిడియావరకూ, తరువాత అయోనియావరకూ అతని విజయధ్వజం విర్రవీగుతూ విహరించింది. అయితే అప్పుడు ప్ర.... ప్ర.....
ఆంటోనీ : ఆంటోనీ అని వ్యవహరించు.
వార్తాహరి : ఓ ప్రభూ!
ఆంటోనీ : సూటిగా ప్రసంగించు. వ్యవహారాలను క్లిష్టం చెయ్యకు. రోములో ఆమెను గురించి ఎలా వ్యవహరిస్తారో అలాగే క్లియోపాత్రా అని వ్యవహరించు. ఫుల్వియా
ఆంటోని - క్లియోపాత్రా
178