మిగిలిపోతానా? ఏబదిఏళ్ల వయసులో జూరీ హీరాడ్ ను లొంగదీసే కొడుకును కనేట్టు చెయ్యండి. ఆక్టేవియస్ సీజర్ను పరిణయమాడి నా యజమానురాలితో సమానమైన సాంఘికగౌరవం పొందేటట్లుగా చెయ్యండి.
జోస్యుడు : ఏ ప్రభ్విని ఈ నాడు సేవిస్తున్నావో ఆమె మరణానంతరంకూడా నీవు సజీవవుగానే ఉంటావు.
ఛార్మియన్ : మనోజ్ఞమైన విషయం. దీర్ఘకాలజీవితమంటే నాకు అత్తిపళ్ల మీద కంటే అమితాసక్తి.
జోస్యుడు : అనుభవించనున్న అదృష్టంకంటే అనుభవించిందే మిక్కిలి మనోహరమైందిగా నాకు తోస్తున్నది.
ఛార్మియన్ : అంటే, బహుశః నాకు కలిగే సంతానం తండ్రులెవరో తెలియక పేర్లు లేకుండా ఉంటారన్నమాట! అయ్యా, సెలవీయండి వారిలో మొగవెధవ లెందరు? ఆడముండలెందరు?
జోస్యుడు: నీవు కోరిన కోరికల్లా గర్భాన్ని ధరించి ఫలిస్తే పదిలక్షలమంది.
ఛార్మీయన్ : మూర్ఖుడా! ఇక నడు! ఇంతకంటే నీవు బాగా భవిష్యత్తును చూచి చెప్పలేవు కనుక మాంత్రికురాలిని చేసినట్లు నిన్ను మంటలపాలు చేస్తానని భయపడకు. ఇక చాలు. ఐరాస్ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పు చూతాం.
ఎలెగ్జాస్ : మా భవిష్యత్తులు ఎలా ఉంటాయో మాకు తెలియనే తెలుసు.
ఎనోబార్బస్ : నా అదృష్టంలో, నా బోటి ఇతరుల అదృష్టంలో ఏముంటుంది, తప్ప త్రాగి నిద్రపోవటం తప్ప?
ఐరాస్ : ఇతరాలను వేటిని తెలియజేసినా లేకపోయినా, నా హస్తపావిత్ర్యాన్ని వెల్లడించి తీరుతుంది.
ఛార్మియన్ : నిండి ప్రవహించే నైల్ క్షామాన్ని సూచిస్తే నీ హస్తం పునీతతను ప్రదర్శిస్తుంది.
ఐరాస్ : ఛీ! ఉన్మత్తురాలా! వెళ్లిపో! జోస్యం నీవేం చెప్పగలవు?
ఛార్మియన్ : నీ హస్తంవంటి తడిచేయి ఫలకారి అయిందని జోస్యం చెప్పలేకపోతే ఏ స్వల్పవిషయాన్నీ నేను చెయ్యలేనన్నమాట! అయ్యా! మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయ ఉంచి దీనికో సర్వసాధారణమైన ఫలితాన్ని సెలవీయండి.
ఆంటోని - క్లియోపాత్రా
177