వైభవప్రియుడు, అందువల్లనే ఉదాత్తుడైన అంటోనీలోని యోధాగ్రేసరత్వంతోబాటు రాజసవిలాసప్రియత్వం కూడా ఇతనికి ఇష్టగుణాలైనవి. ఆంటోనీ ఆక్టేవియాను వివాహమాడటం సూటియైన చిత్తప్రవృత్తి గల ఇతనికి ఏ మాత్రం నచ్చలేదు.
కన్యాప్రదానసమయంలో ఆంటోనీ చూపించిన క్షణికోద్రేకాన్ని, ఆక్టేవియస్ ప్రదర్శించిన కృత్రిమ సోదరీప్రణయాన్ని ఇతడు నిరసించాడు. ఆంటోనీ లభించిన సహజావకాశాల నన్నిటినీ ఐచ్ఛికంగానే పోగొట్టుకొంటూ, గుప్తవనితకు దాసానుదాసుడై వర్తించటం ఆరంభించింది మొదలుగా ఆంటోనీయెడ భక్తివిశ్వాసాలీతనికి సడలనారంభించాయి. అంత అధికంగా ఇతడు ఆంటోనీయెడ అభిమాన గౌరవాలను.ప్రదర్శించటానికి ఇతడి సహజావబోధ ముఖ్యకారణం. అతని గుణవిశేషాలను బుద్ధితో కూడా కొంత వివేచించకపోలేదు. ఆక్టియం యుద్ధంలో అంటోనీకి లభించిన అపజయాని కతడు క్లియోపాత్రాను నిందించలేదు. బుద్ధింకాక కాంక్ష నడిపించేటట్లు నడిచే ఆంటోనీదే దోషం అని తేల్చాడు.
ఓటమివల్ల ఒడలెరుగక ఆంటోనీ ఆక్టేవియన్ ను ద్వంద్వయుద్ధాని కాహ్వానిస్తున్నప్పుడు, ఇతడు "అందుకు ఆక్టేవియస్ లభించిన అవకాశాలను అవతలపెట్టి ప్రజలు దర్శించటంకోసం ద్వంద్వయుద్ధం చెయ్యటానికి అంగీకరించ”డని ముందే నిర్ణయించాడు. అంటోనీ మానసిక గుణవిశేషాలను గూడా అదృష్టం తనవెంట నడిపిస్తున్నదని, సీజర్ ఆంటోనీ నిర్ణాయక శక్తిమీద కూడా విజయం చేకొన్నాడనీ సందర్భంలో ఇతడు పల్కిన వాక్యాలు ఇతని విషయవివేచనాశక్తికి చక్కని నిదర్శనాలు.
ఎనోబార్బస్ తన యజమానిని తుదిదాకా భక్తివిశ్వాసాలతో కొలిచాడన్న మాట సత్యం. అట్టి భక్తివిశ్వాసాలను ఈతనిలో పురికొల్పగలిగిన ఆంటోనీ ఔదార్యం. అతిశయస్వామిభక్తి పరాయణుడు కావటం వల్లనే, ఇతడు ఆంటోనీ ఆప్తానుచరులైన కానెడియస్ మొదలైనవారు అతణ్ణి విడిచిపెట్టి పరపక్షంలో చేరినతరువాత కూడా, కొంతకాలం అంటిపెట్టుకొని ఉన్నాడు. విధి వ్యతిరేకమని తోచిన సందర్భంలో కూడా వీరోచితంగా పోరాడాడు. పరాజయంవల్ల కలిగిన కళవళపాటు చేత ఆంటోనీ ప్రదర్శించిన క్రోధోన్మత్తప్రవర్తనను జూచినతరువాత, అతని హృదయాన్ని త్రోసిరాజని బుద్ధి విజృంభించి అర్థరహితుడైన తన స్వామిని పరిత్యజించి పరపక్షంలో చేరిపోవాలన్న ప్రబలవాంఛ నీతనికి కల్గింది. బయలుదేరి వెళ్ళాడు గాని స్వామిద్రోహి నన్న భావం అతని హృదయాన్ని వెన్నాడి, కలత పెట్టటంతో ఇతని ఉదాత్తప్రకృతే విజయం పొందింది.
ఆంటోని - క్లియోపాత్రా
163