Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- 8. ఏయనియస్ ఒక ట్రాయ్ వీరుడు. ఇడామౌంట్ మీది డార్దానసక్కు రాజైన ఆన్చెసిస్కు వీనస్ వల్ల జన్మించాడు. పది సంవత్సరాలు ముట్టడించి గ్రీకులు ట్రాయ్ని పట్టుకొని దగ్ధం చేసినప్పుడు, ఇతడు తన తండ్రిని తన భుజాలమీద ఎత్తుకొని, నగరంలోనుండి బయటపడవేసినట్లు వర్జిల్ కవి. 'ఈదడానికి ఏనిడ్ వల్ల తెలుస్తున్నది' సీజర్ గజ ఈతగాడని ఎన్నో కథలున్నాయి. కానీ షేక్స్పియర్ మానసిక శారీరక దౌర్బల్యం గల సీజర్ రోమక సామ్రాజ్యాన్ని ముందుగా కలగని అందుకు యత్నిస్తున్నట్లు చూపించటానికి, చరిత్రకు భిన్నంగా ఇలా కాషియస్చే పలికించాడు. 9. టిటినియస్ - సీజర్కు స్పెయిన్లో మిత్రుడు, పారిపార్శ్వకుడు. 10. కొలోసస్ - అప్పొలో దేవతకు రోహెడ్సు రేవులో నిల్పిన ఒక వరిష్ఠప్రతిమ. ఈ విగ్రహం పాదాల క్రిందుగా తెరచాపలు దించకుండానే నౌకలు ప్రయాణించ వచ్చునట! రోడ్స్ వద్ద కొలోసస్ అని ప్రఖ్యాతి వహించిన ఈ మూర్తి ప్రపంచ సప్త వైచిత్రాలలో ఒకటి. 11. మహాప్రళయానంతరం - క్రీ.పూ. 1403న ఈ ప్రళయం థెస్సలీలో జరిగినట్లు భావింపబడుతున్నది. ప్రొమిథియస్ పుత్రుడైన డ్యూకాలియన్ కాలంలో మానవులు చేసే అపచారాల మీద కలిగిన కోపం వల్ల ఈ ప్రళయాన్ని జూపిటర్ కల్పించాడట! ఈ ప్రళయం నుంచి డ్యూకాలియన్, అతడి భార్య పైఠాహా థెమిసిస్ దివ్యవాణి ఇచ్చిన సలహాను అనుసరించి, మౌంట్ పార్నాసస్ మీద నిలిచి బ్రతకగలిగినట్లూ, మానవజాతి నష్టాన్ని తీర్చటంకోసం వాళ్ళు వారి జేజెమ్మ ఎముకలను వెదజల్లారనీ, డ్యూకాలియన్ చల్లినవి పురుషులూ, అతని భార్య చల్లినవి స్త్రీలూ అయినట్లు గ్రీకు పురాణగాథల వల్ల తెలుస్తున్నది. 12. పూర్వం ఒకానొకప్పుడు ఒక బ్రూటస్ - ఇది టార్క్విన్సును పారద్రోలి రాచరికాన్ని రద్దు చేయటంలో ప్రముఖపాత్ర వహించిన లూషియస్ జూనియస్ బ్రూటస్. ఇతడు రోముకు మొదటి కాన్సల్ టార్క్విన్స్ రాజ్యపాలనను పునరుద్ధరించటానికి యత్నించిన తన కుమాళ్ళనిద్దరిని చంపుకొన్న దేశాభిమాని. ఇతని తృతీయపుత్రుని సంతతివాడు నాటకం నాటి బ్రూటస్. 128 వావిలాల సోమయాజులు సాహిత్యం-3