లోపల యుద్ధధ్వనులు, పరిగెత్తిపొండి, పరిగెత్తిపొండి అన్న కేకలు వినిపిస్తున్నవి.
క్లిటస్ : పరుగెత్తిపొండి! ప్రభూ, పరుగెత్తిపొండి!
బ్రూటస్ : పదండి, నేను అనుసరిస్తున్నాను.
(క్లిటస్, డార్జీనియస్, వొలుమ్నియస్ నిష్క్రమిస్తారు)
స్ట్రాటో! నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ ప్రభువుకు అండగా నిలు. మంచికీర్తిని సంపాదించుకున్నవాడివి. నీ జీవితం నిండా గౌరవామోదం నిబిడమై ఉంది. నా కత్తిని పట్టుకో. నీ ముఖాన్ని ప్రక్కకు త్రిప్పు నేను దానిమీద పడిపోతాను.
స్ట్రాటో : ప్రభూ! ముందు మీ హస్తచాలన సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి. ఇదే మీకు వీడ్కోలు.
బ్రూటస్ : ఉత్తముడా, స్ట్రాటో, ఇదే నీకు వీడ్కోలు!
(బ్రూటస్ కత్తిమీద పడిపోతాడు)
సీజర్, ఇక శాంతించు. నన్ను నేనే చంపుకుంటున్నప్పటి చిత్తస్ఫూర్తిలో అర్ధాంశంతోనైనా నిన్ను నేను చంపలేదు!
యుద్ధధ్వనులు వినిపిస్తుంటాయి. ఆక్టేవియస్, ఆంటోనీ ప్రవేశిస్తారు. మెసెల్లా,
లూసిలియస్, సైన్యాలు ప్రవేశిస్తారు.
ఆక్టేవియస్ : ఆ వ్యక్తి ఎవరు?
మెసెల్లా : మా యజమానికి సేవకుడు. స్ట్రాటో! ప్రభువువారెక్కడ?
స్ట్రాటో : మెసెల్లా! నీవు పడ్డ బానిసత్వాన్ని తప్పించుకొన్నారు. విజేతలు వారి చితాగ్నిని తప్ప చూడజాలరు. ఆయన తన్ను తానే చంపుకున్నాడు. ఆయనను చంపానని సగర్వంగా చెప్పుకొనే అవకాశం ఎవరికీ లేదు.
లూసిలియస్ : మహోదాత్తుడు బ్రూటస్ తన ఆధిక్యానికి అనుగుణంగా ప్రవర్తించాడు. బ్రూటస్ మహాశయా! నీవు లూసిలియస్ అంటున్నట్లే చేశావు.
ఆక్టేవియస్ : బ్రూటస్ ను సేవించేవారందరినీ నేను ఉద్యోగాలిచ్చి పోషిస్తాను. ఏమోయ్! నా సేవలో కుదరటం నీకిష్టమేనా?
స్ట్రాటో : మెసెల్లా ఇందుకు అంగీకరిస్తే అలాగే.
జూలియస్ సీజర్
125