కాషియస్ : దిగి రా. ఇక చూడకు. అయ్యో! నా కళ్ళ ఎదటనే నా ప్రియమిత్రుడు బందీ అయిపోతే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేనెంత పిరికివాణ్ణి!
పిండారస్ దిగివస్తాడు.
ఒరేయ్, ఇక్కడికి రా! పార్థియాలో53 నిన్ను నేను బందీగా పట్టుకున్నాను. అప్పుడు నీకు ప్రాణదానం చేస్తూ 'మీ ఆజ్ఞలనన్నింటినీ పాలిస్తా'నని నీ చేత ప్రమాణం చేయించాను. రా. నీ ప్రమాణాన్ని నిలువబెట్టుకో. ఇప్పుడు నీవు స్వతంత్రుడివి. ఇదిగో, సీజర్ ఊపిరితిత్తుల్లో దూరిన ఈ కత్తితో నా కడుపును గాలించు. సమాధానం చెప్పటానికి ఆగకు. ఇదిగో! ఉఁ, అందుకో. నేను ఇలా చేతుల్తో మూసుకోగానే కత్తిని కడుపులోకి నడిపించు.
పిండారస్ అతణ్ణి పొడిచివేస్తాడు.
సీజర్, నీవు ప్రతీకారాన్ని పుచ్చుకొన్నావు. నిన్ను చంపిన కత్తితోనే ప్రతీకారాన్ని పుచ్చుకొన్నావు.
(పడిపోతాడు)
పిండారస్ : నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణి. కానీ నేను ధైర్యం చేసి స్వతంత్రించి ఆయన్ను కాదని వ్యవహరించినట్లైతే స్వతంత్రుణ్ణయ్యేవాణ్ణి కాను. అయ్యో! కాషియస్ మహాశయా! ఎప్పుడూ ఏ రోము పౌరుడూ నన్ను గుర్తించని ఏ దూరదేశానికో నీ ఈ పిండారస్ పారిపోతున్నాడు.
మెసెల్లా : టిటినియస్! ఇది కేవలం స్వల్పమైన మార్పేనా? బ్రూటస్ మహాశయుని సైన్యం ఆక్టేవియను జయించింది. కాషియస్ సైన్యాలు ఆంటోని చేజిక్కాయి.
టిటినియస్ : ఈ వార్త కాషియస్ కు సంతోషాన్ని చేకూరుస్తుంది.
మెసెల్లా : నీవు అతణ్ణి ఎప్పుడు వదలి పెట్టి వచ్చావు?
టిటినియస్ : నేను వదలివచ్చినప్పుడు నిరాశ పూర్ణంగా ఆయన్ను ఆవరించి ఉంది. అప్పుడు ఆయన తన బానిస పిండారస్ ఈ కొండమీద ఉన్నాడు.
మెసెల్లా : ఈ నేలమీద పడి ఉంది ఆయన కదూ?
టిటినియస్ : సజీవుడుగా ఉన్నట్లు లేదే. అయ్యో! హృదయమా!
జూలియస్ సీజర్
119