ఉంటాడాయన. మనను ఆంటోనీ చుట్టివేస్తుంటే, అతడి సైనికులందరూ దోపిడికోసం శత్రుశిబిరాలమీద పడ్డారు
పిండారస్ ప్రవేశిస్తాడు.
పిండారస్ : ప్రభూ! దూరంగా వెళ్ళిపొండి దూరంగా వెళ్ళిపొండి. మార్క్ ఆంటోనీ మీ శిబిరాలలో ప్రవేశించాడు. ఉదాత్తుడా, కాషియస్, దూరంగా వెళ్ళిపోండి.
కాషియస్ : ఈ కొండ చాలా దూరాన్నే ఉంది. టిటినియస్! చూడు, చూడు! ఆ అగ్ని దగ్ధమౌతున్న శిబిరాలు నావేనా?
టిటినియస్ : అవును ప్రభూ! మీవే.
కాషియస్ : టిటినియస్! నీకు నామీద ప్రేముంటే అశ్వాన్ని ఆరోహించి తరిమి పరుగెత్తించి పారిపో. ఆ దూరసైన్యాల దగ్గిరికి వెళ్ళి అవి మిత్రసైన్యాలో శత్రు సైన్యాలో తెలుసుకొని, రా.
టిటినియస్ : భావవేగంతో వెళ్ళి తిరిగివస్తాను.
(నిష్క్రమిస్తాడు)
కాషియస్ : పిండారస్! కొండపైకి వెళ్ళు - నాకు చూపు బాగా లేదు. టిటినియస్ నన్ను చూస్తుండు. యుద్ధభూమిలో జరిగే విశేషాలు నాకు అక్కడినుంచి నివేదిస్తుండు.
పిండారస్ కొండ ఎక్కుతాడు.
నేను ఈ నాడే జన్మించాను నేపుట్టిన ఈ నాడే మరణిస్తాను. నా జీవితం తన యాత్రను పూర్తి చేసుకొన్నది. ఒరేయ్! విశేషాలేమిటి?
పిండారస్ : (పైనుంచి) ప్రభూ!
కాషియస్ : విశేషాలేమిటి?
పిండారస్ : టిటినియస్ నన్ను ఆశ్వీకులు చుట్టుముట్టారు. అయినా అతడు ఇంకా అశ్వాన్ని తరుముతూ పరువులు పెట్టిస్తూనే ఉన్నాడు. వారు ఇప్పుడు అతడికి చాలా దగ్గరగా చేరారు. టిటినియస్! పరుగెత్తి పో!! శత్రువుల్లో కొందరు అశ్వికులు దిగుతున్నారు. టిటినియన్ కూడా దిగాడు. అయ్యో! వారు అతణ్ణి పట్టుకొన్నారు.
(దూరం నుంచి హర్షధ్వని వినిపిస్తుంది)
118
వావిలాల సోమయాజులు సాహిత్యం-3