'పంచమాంకం'
ఒకటో దృశ్యం
ఫిలిప్పీ మైదానాలు. ఆక్టేవియస్, ఆంటోనీ వారి సైన్యాలతో ప్రవేశిస్తారు.
ఆక్టేవియస్ : ఆంటోనీ! మన ఆశలన్నీ నెరవేరాయి. మన శత్రువులు కొండలను దిగిరారనీ, మైదానపు భూముల్లోనే, ఉపత్యకల్లోనే ఉంటారని నీవన్నావు. అలా జరగటం లేదు. వారి సైన్యాలు అతివేగంతో మనమీదికి వచ్చేస్తున్నాయి. ఈ ఫిలిప్పీ వద్దనే మనమీద పడటానికి వారు వస్తున్నట్లున్నారు. మనకు వారు సమాధానం చెప్పటానికి బదులుగా, మనమే వారికి సమాధానం చెప్పవలసి వచ్చేటట్లు కనిపిస్తున్నది.
ఆంటోనీ : వారి మనోభావాలు నాకు బాగా అవగతమైనవే. వారు మనవంకకు రారు. ప్రక్కగా తప్పుకొనిపోవటంతో తృప్తి పడతారు. ఈ దృశ్యం ద్వారా మహావీరుల్లాగా మనమీదికి వచ్చిపడేటట్లు మనకో అభిప్రాయం కలిగించటానికి కనిపిస్తారేగాని, అటువంటి పరాక్రమం వారిదగ్గర లేదు.
ఒక వార్తావహుడు ప్రవేశిస్తాడు.
వార్తావహుడు : సేనాపతులకు ఆజ్ఞలిచ్చి సిద్ధపడండి. శత్రువులు భయంకర పరాక్రమంతో వచ్చేస్తున్నారు. తమ యుద్ధచిహ్నమైన సిందూర వర్ణకంచుకాన్ని తగిలించుకొని వస్తున్నారు. మీరు వెంటనే ఏమైనా చెయ్యాలి.
ఆంటోనీ : ఆక్టేవియస్ ! ప్రశాంతంగా ఉత్తరభాగపు యుద్ధభూమిని నీవు కాచుకో.
ఆక్టేవియస్ : నేను దక్షిణభాగాన ఉంటాను. ఉత్తరభాగాన్ని నీవు కాచుకో.
ఆంటోనీ : ఈ క్లిష్టసమయంలో నీవు నాతో వ్యతిరేకిస్తున్నావెందుకు?
ఆక్టేవియస్ : నిన్ను వ్యతిరేకించటం కాదు. నేనీ పని చేస్తాను. అంతే!
(బయలుదేరుతారు)
(యుద్ధ దుందుభులధ్వనులు వినిపిస్తుంటవి. బ్రూటస్, కాషియస్,
వారి సైన్యాలు, లూసిలియస్, టిటిలియస్, మెసెల్లా, ఇతరులూ ప్రవేశిస్తారు.)
జూలియస్ సీజర్113
జూలియస్ సీజర్
113