కాషియస్ : నేను సమర్థుణ్ణి!
బ్రూటస్ : సమర్థుడివి కావని నా అభిప్రాయం.
కాషియస్ : ఇక ఉద్రేకపరచవద్దు. నన్ను నేను మరిచిపోవచ్చు. నీ శరీరవిషయం శ్రద్ధ తీసుకో. నన్ను ఇక విశేషంగా కదిలించకు.
బ్రూటస్ : అల్పుడా! ఇక వెళ్ళిపో.
కాషియస్ : అది ఎలా సాధ్యపడుతుంది?
బ్రూటస్ : అయితే విను. నీ ఉద్రేకాలకు నేను లొంగిపోవలసిందేనా? ఒక ఉన్మత్తుడు ఉరిమిచూస్తే బెదరిపోవలసిందేనా?
కాషియస్ : దేవతలారా! ఇదంతా నేను సహించి తీరవలసిందేనా? బ్రూటస్: ఇంతేనా? ఇంకా సహించవలసి ఉంటుంది. మహాగర్వంతో కన్నులుగానని నీ హృదయం బద్దలయ్యేటంతవరకూ కోపాన్ని వెలిగ్రక్కు నీకెంతటి కోపశక్తి తీవ్రత ఉందో నీ బానిసలకు చూపించు. వారిని గజగజలాడించు. నేను నీ కోపతాపాలను కనిపెట్టి నడుచుకోవాలా? నీ కోపేచ్ఛాను సారంగా నేను వంగి లేవాలా? దేవతలు సాక్షిగా చెప్పుతున్నాను. ఎంతటి కష్టమైనా సరే నీ ప్లీహం39 లోని విషాన్ని జీర్ణించుకో! ఈ నాటినుంచీ నీవు కోపం తెచ్చుకున్నప్పుడు నాకు ఉత్సాహాన్ని కల్పించటానికి అలా పరిహాసకుడిలా నటించి నవ్విస్తున్నావని భావిస్తాను.
కాషియస్ : అయితే వ్యవహారం ఇంతదాకా వచ్చిందన్నమాట!
బ్రూటస్ : నేను నీకంటే గొప్ప యోధుణ్ణన్నావు, నిరూపించు, నీ ప్రగల్భాలు సత్యాలని నిరూపించు. అప్పుడు నేను సంతోషిస్తాను. నా విషయం చెపుతున్నాను, విను నాకంటే ఉదాత్తుడైన వ్యక్తిదగ్గరనుంచీ నేర్చుకోవటానికి నేనెప్పుడూ సంసిద్ధమే.
కాషియన్ : నన్ను అవమానిస్తున్నావు బ్రూటన్! నీవు నన్ను సర్వరీతులా అవమానిస్తున్నావు. నేను నీకంటే వృద్ధ సైనికుడ నన్నాను గొప్ప సైనికుడనని అనలేదు. అన్నానా?
బ్రూటస్ : నీవు అన్నా నేనేమీ లక్ష్యం చెయ్యను!
కాషియస్ : సీజర్ సజీవుడై ఉన్ననాళ్ళల్లో ఆయనకూడా నాకెప్పుడూ ఇంతగా కోపాన్ని తెప్పించటానికి సాహసించలేదు. 102వావిలాల సోమయాజులు సాహిత్యం-3
102
వావిలాల సోమయాజులు సాహిత్యం-3