బ్రూటస్ : ఓహో సైనికులారా! నిలవండి, ఆగిపొండి. ఆగిపొమ్మనే ఆజ్ఞను సైన్యాల కందజేయండి!
ప్రథమ సైనికుడు : ఆగిపొండి!
ద్వితీయ సైనికుడు : ఆగిపొండి!
తృతీయ సైనికుడు : ఆగిపొండి!
తృతీయ సైనికుడు : ఆగిపొండి!
కాషియస్ : బావగారూ! మీరు నాకు అపచారం చేశారు.
బ్రూటస్ : దేవతలారా! ఈ అభియోగాన్ని మీరు విచారించండి. నా శత్రువులకైనా అపచారం చేయలేనే? అట్టి స్థితిలో నా బావమరదివైన నీకు నేనెలా అపచారం చేయగలుగుతాను?
కాషియస్ : మీరు చేసిన చెడ్డపనులకు మీ ప్రశాంత ప్రవర్తన మంచిముసుగులా ఉంది. వాటిని మీరు చేసేటప్పుడు...
బ్రూటస్ : కాషియస్! ఉద్రేకాన్ని పొందకు. నీకేవైనా బాధలుంటే ప్రశాంత చిత్తంతో తెలియజెయ్. నిన్ను నేను బాగా ఎరుగుదును. గాఢంగా మనలను ప్రేమించే మన ఉభయ సైన్యాలముందు మనం వివాదపడవద్దు. నీ సైన్యాలను పంపించివెయ్యి. తరువాత నీ బాధలేమిటో చెప్పు నేను వింటాను.
కాషియస్ : పిండారస్! మన సేనానాయకులను సైన్యాలను ఈ ప్రదేశానికి కొంతదూరంగా నిలుపమని ఆజ్ఞాపించు.
బ్రూటస్ : లూషియస్, మన సైన్యాలను గూడా అలాగే దూరంగా నిలుపు. మా ఇరువురి సంభాషణా పూర్తి అయ్యేదాకా నా శిబిరంలోకి ఎవరినీ ప్రవేశపెట్టవద్దు. ద్వారం వద్ద లుసిల్లియస్, టిటినియన్లను కాపలా ఉంచు.
మూడో దృశ్యం36
బ్రూటస్ గుడారంలో, బ్రూటస్, కాషియస్ ప్రవేశిస్తారు.
కాషియస్ : సార్డియన్ల వద్ద లంచాలు తీసుకొన్నాడని లూషియస్ పెల్లాను37 దోషిగా భావించి, విచారించి, శిక్ష చెప్పి మీరు నాయెడ ద్రోహం చేశారు. అతడు గౌరవనీయుడని
100
వావిలాల సోమయాజులు సాహిత్యం-3