నాగమ్మ : ప్రభూ! మన సేవలనూ రేపే కదిలించడం ఉత్తమం. గడువు త్వరలోనే పెట్టుకున్నాము.
నరసింహ : మళ్ళీ ఆలస్యమైనకొద్దీ, ఆవేశం చల్లారిపోతుంది. ఈ పీడ త్వరగా వదిలించుకోటం మంచిది. తరువాత సుఖంగా గుండె మీద చెయ్యివేసుకొని నిద్రపోవచ్చు.
నలగామ : అవును. శత్రువంత గొప్పవాడు కాకపోయినా చమిరి వేసేదాకా ఉత్తమ క్షత్రియుడు నిద్రపోలేడు.
నాగమ్మ : కాని, ప్రభూ! రేపే బయలుదేరటానికి వీలు లేనట్లున్నది.
నరసింహ : ఆలస్యమెందుకు?
నాగమ్మ : మన కేతరాజు రాలేదు.
నలగామ : తాను వచ్చేటంత వరకూ సైన్యాలను కదిలించవద్దని పత్రిక పంపించాడు కూడా.
నరసింహ : అంతగా అతను వస్తే దారిలో కలుసుకుంటాడు.
నాగమ్మ : అతడికి కోపం వస్తుందేమో!
నలగామ : అతని మనఃప్రవృత్తి అటువంటిదే.
నాగమ్మ : అరుగో కేతరాజులుంగారు రానే వచ్చాడు.
కేతరాజు : (ప్రవేశించి) మహారాజా! నమస్కారము. (సౌహార్ద్ర పూర్వ కముగా) మహామంత్రిణీ కుశలమా? నరసింహా...
నలగామ : తండ్రీ! కేతరాజూ! కోటలో అంతా క్షేమమా? భీమరాజులవారి అస్వస్తత ఏమైనా నెమ్మళించిందా?
నరసింహ : అందరూ క్షేమమేనా, రాజూ!
కేతరాజు : అమరేశ్వర స్వామి కృపవల్ల అంతా కుశలమే.
సైన్యాన్ని వెంటపెట్టుకొని రమ్మని వార్త పంపారు. యుద్ధానికి నిశ్చ యించుకున్నారా ఏమిటి?
నలగామ : నిశ్చయించుకోవటమేమిటి? కదనరంగం కారెంపూడిట. బ్రహ్మన్న, అన్న, యుద్ధం చేసేదాకా వదిలేటట్టు లేరు.
నాయకురాలు
69