Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీముడు


ఇంత దైన్యమ్మేల బాలా?
ఇంత బేలై పోతి వేలా?
నెలవంక సిగపైన
నిలుప కొనిరానా?
వలపు మెరుపులతీవ
కలుపుకొని రానా?
జలధి గర్జాంతరో
జ్వల శుక్తి ముక్తాళి
కలతార హార పం
క్తుల కాన్కవెట్టనా -ఇంత దైన్యమ్మేల

ఎగురునా నీ తోడ
ఏ పతత్రిగ న్వి
ఈ విహాయస వీధి
గంధర్వనన కొలను -ఇంత దైన్యమ్మేల


ద్రౌపది


తళుకుల ఈ క్రొందామర
ఎలిపిన నెలవంక ఏల?
మెరపుతీవ గమి కాదా
ఒరసెడి నీ కనుచూపులు
- అవి ఏల నాకోయి ప్రియుడా
అలసింరుక మోయి ప్రియుడా!
తారహార పంక్తులపై
తరలడిగిపో నా హృదయము,
గగనాంగణ సౌభాగ్యము
కాంక్షింపగ మాతకినీ
-అవి ఏల నాకోయి ప్రియుడా
ఆలసింపకు మోయి ప్రియుడా!!
ఈ పుష్పాస్తృత శయ్యను
హేలానవ మదన కేళి
లోలురమై ఏక మౌట
ఈ ప్రియ ప్రియ కాంక్షితమా
అవి ఏల నాకోయి ప్రియుడా!
ఆలసింపకమోయి ప్రియుడా!!


భీముడు


దీన వైనా విందు కేనా?
నిము సాన ఏనుకొని రావా!
ఏడు యీ ఏడులోకాలలో ఎట నున్న
నీ యాన ఏనుకొనిరానా
లోకాధిపతు లడ్డమైనా
ఏ కదనమది దొడ్డదైనా
కొలతు కొల నెల్ల కొని వత్తూ
కొలనునీ కాన్కగా నిత్తూ

సాగిపోనా దివ్యబాలా!
ఏగిరానా నవ్యహేలా?
నీ తలపునకు వెనుదీయలేదే
నీ వలపు నా వలపు కాదా?
సాగిపోనా దివ్యబాలా


ద్రౌపది


ఓహోహో ప్రియసాహస
ఓహో మధురోల్లాస
నా ప్రణయమే పాధేయము
నవనవాధ్వముల ప్రియుడా
ఓహోహో ప్రియసాహస!
ఓహో మభురోల్లాసా!


గేయ నాటికలు

645