నలగామ : (ఒక్క తడవగా) సరీ పోయింది, సంచు నేయనూ, ఉతకనూ, సాలెమల్లు, చాకలి మల్లు, నోరు కుట్టెయ్యనూ, తలమీద పెట్టు వెయ్యనూ కంసాలి మల్లూ, కుమ్మరమల్లూ, బుర్రగొరగనూ, పూడ్చి పెట్టనూ మంగల మల్లూ, మాదిగ మల్లూ.
(అందరూ విరగబడి నవ్వుతారు. ఇంతలో ఒక సేవకుడు ప్రవేశించి నమస్కారం చేసి)
సేవకుడు : ప్రభూ! ఎవరో రాయబారిట!!
నలగామ : వేళ్ళ బేరం కాళ్ళ కొస్తున్నట్టుంది.
నాగమ్మ : రాకేం చేస్తుంది. అందితే జుట్టూ, అందకపోతే కాళ్ళు.
నలగామ : మాట్లాడటమేనా?
నరసింహరాజు : రానివ్వండి. రభస చేసి పంపించేద్దాము. ఏ బాబుతో చెప్పుకుంటాడో, ఇచ్చిన చేరెడూ పుచ్చుకొని చెప్పుకింద తేలులా పడి ఉండక నిమిషానికొక రాయబారిట! రాయబారి!! ఇష్టం వచ్చినట్లు వాగి పోతారు. ఈ మాటు మితిమీరితే ఉప్పుపాతట్లో పాతేయిస్తాను.
నలగామ : మహామంత్రిణీ! తమ్ముడూ, నరసింహా! తప్పకుండా చెయ్యాలి. తైతక్కలాడిన అలరాజు హతమైనాడు.
నరసింహ : లేకపోతే (మీసం మెలివేస్తూ) అన్నగారిని అడ్డం వచ్చినట్లు అల్లుణ్ణని మాట్లాడటమా?
నాగమ్మ : ఇక అతణ్ణి ప్రవేశపెడదామా?
నలగామ : (సేవకుడితో) అతణ్ణి లోపలికి
(సేవకుడు చిత్తమని నిష్క్రమిస్తాడు)
నాగమ్మ : ఈ తడవ ఎవరిని పంపించి ఉంటారు?
నరసింహ : కొమ్మన్ననా?
నలగామ : అతడు నా గుమ్మం తొక్కనన్నాడు.
నరసింహ : (అవహేళనగా) అబ్బో! చాలా తక్కువైంది. ఆ పక్షి రాకపోతే మనమేమన్నా బతగ్గలమా?
64
వావిలాల సోమయాజులు సాహిత్యం-2