శోభా నవ తరుణిమ మా
శుష్క జీవ వనముల కిక
ఋతునేతా...
షట్పదరాజు
చిరుగాలి కెరటాల
పరువు బరువుల మ్రోయు
ఏ పూవు చూచినా
ఎడద కనుతాపమ్మె
వాసనల బలమూని
వాతెరల మధువాని
బానిసలగా జేయు
పవనుడెంతటివాడు
బ్రతుకు టెలతోటలకు
ప్రసవప్రణయమె శిశిర
వమృత కుసుమాప్సరల
కకట బాని బ్రతుకె చిరుగాలి...
సుమప్రియ
నెమ్మదికి రావె యీ తుమ్మెదకు ఓ పూవ
అమ్ముకోబోకె నీ నెమ్మనము
ఓ పూవ
పొలతి బేలవె నీవు
ప్రొడతన మెరుగకా
ననకులమ్మున కెంత
నగుబాటె! నగుబాటె! ॥నెమ్మదికి॥
ఈ కోన నీకంటె
తావిగల పూవేది
ఆతురత ఏకాని
అతడెరుగడె సొగసు ॥నెమ్మదికి
షట్పదరాజు
ఏకోన పూవువౌ నీవు
నీతావి పూవులకు రాదు
హిమ వాలుకా స్వచ్ఛ
మెంత చల్లని చూపు
హిమ బంధు బంధురం
బెంత చక్కని రూపు ॥ఏ కోవ॥
ఏ చిరంతన పుణ్య
మోనాక ఫలమువో
ఏ మధువ్రత మూర్తి
హృదయాధి దేవతవొ ॥ఏ కోవ॥
సుమప్రియ
తుమ్మెదవా! తుమ్మెదవా
నమ్మరాని తుమ్మెదవా!
మనసిచ్చిన పాటలతో
మరులు కొల్పి యీ కన్నియ
మధువానిన వెనుక నీవు
మరల మోము చూపింపవు
తుమ్మెదవా
వలపింపకు లే యెడదల
విలపించెడు వేదనతో
విరహ బాధ మెరుగకయీ
విరుల మనసు దొరుకదు పో
తుమ్మెదవా
606
వావిలాల సోమయాజులు సాహిత్యం-2