సుమ ప్రియ (గీతి నాట్యము)
వసంతుడు
ఉజ్వల రస పరమేశ్వరి
ఓహోహో అమృతమయీ!
జ్యోత్స్నా నభ సరసీమధు
కుముదవనీ గృహరమణీ ॥ఉజ్వలరస॥
క్రేంకారిత తుహినయవని
కాభ్యంతర దివ్యవాణి ॥ఉజ్వలరస॥
బాలాతప వికసితనవ
సితసరోజ దరహాసిని ॥ఉజ్వలరస॥
శ్ర వదాశా శుభతుందిల
శుచి శోభారాగధునీ ॥ఉజ్వలరస॥
లాస్య రచిత చరణాంబుజ
మణి మంజుల రవకింకణి ॥ఉజ్వలరస॥
తమసావృత హృదయకుహర
రుచి మండిత బహుళ ఘ్రణీ ॥ఉజ్వలరస॥
పుష్ప కన్యలు
(ప్రవేశించి)
ఒక పూవు
స్నిగ్ద కాంతి వాసంతిక
దుగ్దహస శామంతిక
కోకనదా కుసుమరాజ్ఞి
మందారమ మధుర రోచి
రారె రారె సఖులారా
సాగిరారె సఖులారా
నవవసంతు డరుదెంచును
నతులీయగ రారేలా
విరహతమము విరియును లే
ఎరసంజులు దరియుము లే
తావిదెసల క్రమ్మునులే -
రారె రారె సఖులారా
పుష్ప కన్యలు
(వసంతుని చుట్టూ మూగుతూ)
ఋతు నేతా వసంతా
నవశోభా లతాలతా
వచ్చినాడు వసంతుడు
నవశోభాలతాంతుడు.
నీ రాకకై నిఖిల జగము
నిలుపు బ్రతుకు కనుతుదలను
వలగొనియెడు కోరికతో
వలపు గ్రుక్కిళులు త్రావుచు
ఋతునేతా...
నందనవన సుందరి నిను
అందగాని రానిచ్చెనె
గేయ నాటికలు
605