భిక్షుకుడు : అవునని నేననుకుంటున్నాను.
బుధాదేవి : రక్షకభటా! ఇతణ్ణి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకోపద.
అమాత్యుడు : రక్షకభటా! రక్షకభటా!
(ప్రవేశిస్తాడు వేగంగా)
రక్షకభటుడు : (అసహ్యంతో) ఏయ్ అబ్బీ ఇలారా!
అమాత్యుడు : (గంభీర కంఠస్వరంతో) జాగ్రత్త - అతడొక్కడే నిక్కువముగ సంతోషస్వాంతుడుగ జీవితం సాగిస్తున్నాడు. కావున నతని నతిగౌరవముతో దేవరవారి సన్నిధికిం జేర్పవలయును -
(జనం - నవ్వుతారు - తెర)
కథకుడు : సంతోష స్వాంతుడు దొరకినాడు. ప్రతి స్వల్ప విషయమున నొక పండుగగుట ఆ దేశాచారము. రాజుగారికా భిక్షుకుని కేశములతో తాయెత్తు కట్టించుట యొక పండుగైనది. 'ప్రత్యేక సమితి'యును నట్టి సభకేతించినది - కాని యెవరి మొఖముననూ సంతోషమన్నది లేదు. చక్రవర్తి ముఖమున నవ్వు తొలకాడితే గాని యితరు లెవ్వరును నవ్వరాదు.)
5
సభ - రాజు రాణి సింహాసనము
అమాత్యుడు : (లేచి) మహాప్రభువు వారినీ సమయమున అత్యధిక సంతోష స్వాంతునితో పరిచయము చేసుకొనవలయునని దేశము అమాత్య ముఖమున కోరుచున్నది.
చక్రవర్తి - సంతోషము.
(భిక్షువును రాజభటులు ప్రవేశపెడతారు)
చక్రవర్తి : (భిక్షుకునితో) నీవు సంతోష స్వాంతుడవన్నమాట
భిక్షుకుడు : మానవుడెంత వరకు సంతోష మనుభవించటానికి వీలున్నదో అంతవరకు నేను సంతోష స్వాంతుడనే.
500
వావిలాల సోమయాజులు సాహిత్యం-2