Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలు లేదు

దగ్గు ఉబ్బసం

క్షయ -

రోగం -

బట్టతల -

ముట్టుకుట్టు -

(మాటలు వినిపిస్తవి - మళ్ళీ వెలుతురు)

అమాత్యుడు : మన పట్టికయందున 105వది

బుధాదేవి : అందులో వారంతా సంతోషస్వాంతులేనా?

అమాత్యుడు : మీరు ప్రశ్నించు వరకు వారెల్ల నత్యధికానందము ననుభవించెదరనియే నేను భావించుచున్నాడనని మనవి చేయుచున్నాను

బుధాదేవి : అయితే ఈర్ష్య, కక్ష, కార్పణ్యం ఇత్యాదులు లోకంలో ప్రబలిపోవడంలేదా? ఇక ప్రేమకు స్థానమెక్కడ ఉంటుంది?

అమాత్యుడు : అయితే మీరు ఇట్టి ప్రశ్నలు నుడువవలసినదేనా? వలసినదేనా యని నేను సంశయించుచుంటి -

4

సభాభవనము

(ప్రవేశము - రాణి - వెంట భిక్షుకుడు)


అమాత్యుడు : స్వాగతము. మహారాజ్ఞీ స్వాగతము - తామంత వేగముగ పట్టణమునకు దిరిగి రాగలిగినందులకు దేశమెల్లరి పక్షమున నీయమాత్యుని నమస్కారములు - “సంతుష్టస్వాంతుని దేవేరి యింత యనతికాలమున గనుగొనగలిగినదే... యని మేమాశ్చర్యాయున్మత్తులమగుచున్నామని దేవేరికి సవినయముగా నమాత్యుడు మనవి చేయుచున్నాడు


ఏకాంకికలు

497