దుఃఖరేఖ మేమాత్రము పొడసూపినను వెంటనే సభాఘంటికను మ్రోయింప వలయుననియు, అట్టి సందర్భమున నీవిదూషక శేఖరుడు సభామధ్యము నుండి తొలగింపవలయుననియు నమాత్యవర్యుడు అంగరక్షాధిపతియగు వర్మ కనుశాసించెను.
2
(సభావనంలో - రాజు, రాణి Enthroned guards stand between the thrones. a careful observer with note book on hand ప్రవేశము, సుమిత్రుడు, అమాత్యుడు)
అమాత్యుడు : (రహస్యంగా) సుమిత్రా! నీ ప్రతిజ్ఞ నిర్వహింపగలవనియే హృదయపూర్వకము విశ్వసించుచుంటి సుమిత్రా!
సుమిత్రుడు: (ముందుకువచ్చి) తిరుహత్తి! ఇతడు మహాగాయకుడు - అతని దేశంలో తిరుహత్తి కంఠస్వరము వినటానికి కోటానుకోట్లు తహతహపడిపోతుంటారు.
అమాత్యుడు : (ముందుకు వచ్చి) అలా అయితే నేను మరికొందరు వైద్యులు వచ్చి ప్రభువారికి నాడీపరీక్ష చేస్తే బాగుంటుంది.
బుధాదేవి : మీరెవరైనా వైద్యులను పిలుచుకోరావాలి.
సుమిత్రుడు : వెంటనే ఎక్కడనుంచి వైద్యుణ్ణి తీసుకోరాను? నాకొక ఘడియ కాలం ఇప్పించాలి.
బుధాదేవి : అయితే మన కార్యాలోచనా సభను ప్రస్తుతం ముగిద్దాము.
(తెర - సంగతులు)
కథకుడు : అంతనొక నాటి మధ్యాహ్న సమయమందుదయ వేళ చక్రవర్తిని సంతోషాంబుధుల నోలలాడింతునని శపథమొనర్చి వెడలిన సుమిత్రుడు సాధన సంపత్తితో పట్టణమును చేరుకొనెనని రాణికి వార్త వచ్చినది. అల్పకాలములోనే మంత్రులు, సామంతులు, జనసామాన్యము, సభాభవనమునకు విచ్చేసిరి. సభయంతయు నిశ్శబ్దముగా యుండెను. అంతటి పెద్ద సభయందొక్కడైన తలయాడింపలేదు. మహాచక్రవర్తి ముఖ విన్యాసములలో నీషధ్భేదము కనుపట్టెనని పరిశీలించుట కమాత్యులవారు నియమించిన పారిపార్శ్వకులు తప్ప నన్యులెవ్వరచ్చట నవయవచాలనమొనర్చు వారు లేకుండిరి.
ఏకాంకికలు
487