అమాత్యుడు : మహారాజ్ఞీ! ఇట్టి సాహస చర్యలకు బూనుకొన్నయెడ నట్టివారు తామొనర్చిన శపథముల నెరవేర్పనియెడ నెయ్యదియోయొక దండము వారి కిప్పించుట బహు ప్రాచీన కాలంబునుండి మన యాచారమై యున్నదని నేనియ్యెడ సవినయముగా మనవి చేయక తప్పదు. మమ్ము బోలిన మహామాత్యులు మేధావిశేషమును తారు మారొనర్చిన శాత్రవ కంఠీరంబగు చండస్కంధ శ్రీవారి ఋగ్మతను తొలగింతునని విశ్వసించు నీయల్పబుద్ధి నయ్యది నెరవేర్వజాలనిచే యాతని దక్షిణ కరపల్లవంబుల ఖండింపదగు.
బుధాదేవి : అమాత్యవర్యా! మీ అభిప్రాయం ఎంతో సమంజసంగా ఉన్నది.
సుమిత్రుడు : ఇందుకు నేను... అం.... గీక.... రింపను.
బుధాదేవి : ఇందాకటి మాటలన్నీ ఏమైపోయినవి? అమాత్య శేఖరా సుమిత్రుని దక్షిణ కరపల్లవాలు వెంటనే ఖండించమని రాజభటులకాజ్ఞాపించు.
బుధాదేవి : సభా అస్థానంలో మరెవరైనా ప్రభువువారికి సంతోషం కలిగించడానికి మార్గాలను ఆలోచించారా? మీరు - భౌమా!
భౌమా : మహారాజ్ఞీ! నాది ఒకటే అభిప్రాయం - ప్రభువు ఏ దేశంమీదనైనా ఒక్కమాటు యుద్ధం చేసి శత్రువులను చీకాకు పరిచివస్తే వారి కండూతితీరి మనస్వాస్థ్వం చేకూరుతుంది.
అమాత్యుడు : అట్టి అమోఘమగు ఊహ నా బుద్ధి కెన్నడో పొడమినది. చక్రవర్తికి నివేదించుకొంటి గాని వారించుకయైన రణభూమిపై నభిమానమును ప్రకటింపలేదు. ప్రభువువారికి బ్రస్తుతస్థితిని మనోల్లాస ప్రదంబగువస్తు వెద్దియన నొక మాంత్రికుడు -
బుధాదేవి : ప్రభువువారి శుభాన్ని కోరి వారికి ఆహ్లాదం కలిగించటానికి మార్గాన్వేషకులైన ప్రజనొక్కరినే ఆహ్వానిస్తాను. - సుమిత్రుడు
సుమిత్రుడు : (లేచి) అనాదికాలమునుంచీ వస్తూ ఉన్న రాజ వినోదాలన్నీ ప్రభువుకు మనోల్లాసం కలిగించడం లేదు. వారికొక నూతనమూ, అధునాతనమూ అయిన క్రొత్త వినోదాన్ని మనం శ్రమపడి సృజిస్తేగాని వారికి ఆహ్లాదం కలుగదని నా అభిప్రాయము.
బుధాదేవి : నిజమే - చక్రవర్తి ముఖమండలము నేమాత్రమైన హాస రేఖలు ద్యోతకములు కాకున్నా, సభికులెవ్వరామోదములను సూచింపరాదనియు, సామ్రాట్టు వదనసీమ
486
వావిలాల సోమయాజులు సాహిత్యం-2