Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ కా పాదుషా. షాహన్‌షా, ఖుదావంద్ ముబారక్ ముబారక్... జెహన్... రోషనారాకీ బహిన్... కాఫిన్ దారా ఖైదీ అయిపోయినాడు. కాపిర్లతో స్నేహం చేసిన వీడికి కళ్ళు పీకించ పోతున్నా.. (జహనారా భయంతో కేక పెడుతుంది). షాజహాన్... అల్లా హపీజ్ కాదు కాదు శిరచ్ఛేదన శిక్ష విధించాను. మరిచిపోతాను. జహనారా...

షాజహాన్: బేటా ఔరంగజేబు ఢిల్లీ పాదుషాలైనందుకు నిన్నొక చిన్న కోరిక కోరుతున్నాను. ఆ విషాద వార్త వినలేను నన్ను నీ కైజారుతో పొడిచి చంపెయ్.

ఔరంగ: జీ నహీఁ పాదుషా దారాకా అబ్బాజాన్ తాము తమ కుమారుణ్ణి ఢిల్లీ ప్రజలు ఎలా స్వాగతమిస్తున్నారో చూచి సంతోషించకుండానే మరణిస్తారా? నేను ఒప్పుకోను. అల్లా అంగీకరించడు (దూరం నుంచీ దారాను ఎగతాళి చేస్తూ వస్తూ ఉన్న జనసమూహం కోలాహలం) సుల్తానా బెహన్ అదుగో నీ భాయీ దారా అఖండ స్వాగతంతో వస్తున్నాడు. ఇబ్రహీం పాదుషావారిని విటంకం దగ్గిరకు నడిపించుకురా...

ఇబ్రహీం: రండి సర్కార్... (దారాను ఎగతాళి చేస్తూ ఉన్న కోలాహలం దగ్గరికి వచ్చేస్తుంది)

ఔరంగ: హఁ హఁ హఁ చాలా కాఫిర్ దారా, మేరా దుష్మన్ ఇస్లాంకా దుష్మన్.

షాజహాన్: బేటా ఔరంగజేబ్ ఇది అక్రమం అన్యాయం, మొగలాయీ వంశానికి తీరని కళంకం... నీవు చేస్తున్న ఈ పాపానికి నిన్నెప్పుడూ అల్లా క్షమించడు.

ఔరంగ: హఁ హఁ హఁ రాజ్యాన్ని ఈ కాఫిర్‌కు కట్టబెట్టదలచిన మిమ్మల్ని క్షమిస్తాను. రే ఇబ్రహీం నీవు త్వరగా వెళ్ళు. దారా శిరస్సును ఖండించి బాలుడు గోరీ దగ్గిరకు చేర్చమని చెప్పు... ఇదుగో ఈ గుర్తు చూపించు... (జహనారా ఏడ్పు వినిపిస్తుంది. షాజహాన్ హఫీజ్ అల్లా అంటాడు.

ఇబ్రహీం ఉండు వెళ్ళకు. అతని శిరచ్ఛేదనా నేను సింహాసనం ఎక్కటం ఒక్కమారు జరగాలి... సమస్త ప్రయత్నాలూ సాగించమని వజీరుతో చెప్పు... ఉఁ...

ఇబ్ర: జీ మాలిక్. అబ్బాజాన్ షాజహాన్ నీ పుత్రులందరిలో మిగిలినవాణ్ణి నేనే. ఢిల్లీ సింహాసనమెక్కుతున్నాను... దీవించండి.

షాజ: హఁ హఁ హఁ పాగల్ బేటా ఔరంగజేబ్ మతాన్ని వృద్ధి చేయటానికి... ఇది మార్గం కాదు. రక్తంతో తడిసి ఎక్కుతూ ఉన్న ఈ సింహాసనం నీ రక్తాన్ని బలి కోరుతుంది. నీ ఆశయం సిద్ధించకపోగా ఆత్మశాంతిని పోగొడుతుంది. నేను అనుభవిస్తూ వున్న ఇటువంటి ఘట్టమే తిరిగి నీ జీవితచరిత్రలో సంభవిస్తుంది.


ఏకాంకికలు

453