మతోన్మాదిని. అన్నలను, తమ్ముళ్ళను, అక్కచెల్లెళ్ళను, తండ్రినీ నా పొట్టన పెట్టుకున్నాను. ఖుదావంద్ షహన్ షా షాజహాన్... అబ్బాజాన్ నీవు చాలా గొప్పవాడివి... భాయీ దారా నీ వెంటపడి వేటకుక్కలా తరిమాను...
(ఫ్లాష్‌బాక్) షాజహాన్ అస్వస్థతతో ఆయాసంతో మాట్లాడుతాడు. జెహనారా దీనంగా ఓదార్పు మాటలు పలుకుతుంది
షాజహాన్: జెహనారా దారా సంగతులేమైనా తెలిసినవా?
జెహ: లేదు అబ్బాజాన్... అతణ్ణి గురించి అట్టే ఆలోచిస్తూ ఉండకండి, ఆయాసం ఎక్కువౌతుంది.
షాజహాన్: (ఆయాసంతో) బేటా దారా ఎంత పొరబడ్డావు... నా మాట విన్నావుకావు. సముర్థర్ సమరాంగణానికి నన్ను వెళ్ళనిచ్చావు కావు. సులేమాన్ వచ్చేదాకా సుస్తి చెయ్యమంటే సైన్యాలల్లో నీతిపోతుందని భయం పడ్డావు... నిన్ను నరరూపరాక్షసి ఏ నట్టడవుల్లో వెన్నాడుతున్నాడో... ఎంత దుస్థితి చేతులారా తెచ్చుకున్నావు. మాకు తెచ్చిపెట్టావు... హాయిఖుదా... హాయిఖుదా.
జహ: అబ్బాజాన్ అట్టే మాటాడకండి దాహం వేస్తుంది. మంచినీటి కూజా ఇంకా రాలేదు.
షాజహాన్: మన ఇద్దరికీ రెండు రోజులకు ఒక చిన్న కూజా మంచినీళ్ళా... మన మేం అపచారం చేశామని? ఖైదీని చేసి కష్టపెడుతున్నాడు? కత్తిని కానుకగా పంపించి అలంఘీరువు కమ్మని ఆశీర్వదించాను... జెహన్ వెర్రితల్లి రోషనారాలా నీవు వీడికి లొంగిపోయి సుఖపడమ్మా. అల్లా కరుణ వచ్చేదాకా ఇలాగే అలమటించి చనిపోతాను.
జెహనారా: (దుఃఖిస్తూ) అబ్బాజాన్ అలా ఆజ్ఞాపించకండి. నేను బులి బుచ్చి కాలాడలేను. ఆ నరకంలోనికి వెళ్ళమని నాతో చెప్పకండి అబ్బాజాన్. అల్లా కృపవల్ల అన్న దారా విజయంతో తిరిగి వస్తాడు.
షాజహాన్: విజయం. అల్లా కృప. అల్లా ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే చూచి ఊరకుంటాడా జెహన్ మన కూజా ఇంకా రాలేదు.
ఔరంగ: (వికటంగా నవ్వుతూ వ్యంగ్యగర్భితంగా మాట్లాడుతాడు) హఁ హఁ హఁ అల్లాలేడూ? అల్లా లేనివాళ్ళకు కూడా ఎందుకు ఇదుగో వెంటబడి పట్టించుకోవచ్చాను. ఇబ్రహీం దాన్ని నేలమీద బ్రద్దలు కొట్టివేయ్. (చప్పుడు) హఁ హఁ హఁ హఁ షాజహాన్
452
వావిలాల సోమయాజులు సాహిత్యం-2