శుష్కించిపోయిందో చూడు... ఏదీ నీ చల్లని చేత్తో ఈ గుండెను ఒక్కమారు స్పృశించు... అచ్ఛా...
(సంతోషాన్ని నటిస్తూ -హాయ్ఁ హాయ్... అల్లా హాఫీజ్)
అజ్జల: లడాయి ఆపించి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అబ్బాజాన్.
ఔరంగ: ఔను... బేటాఁ నీ హృదయం నాకు తెలుసు. ఇవాళోరేపో వస్తావని ఇప్పుడే ఇబ్రహీంతో అంటున్నాను. ఎంత శ్రమపడి వచ్చావు. అలిసిపోయినావు. శ్రమ తీర్చుకో కాంబక్ష్ నీకు ఎదురు వచ్చాడా... రాలేదూ... వద్దన్నానులే.
అజ్జం: రానివ్వకపోయినారా అబ్బాజాన్ కలిసి వచ్చేవాళ్ళము.
ఔరంగ: కాస్త తొందరపాటువాడని భయపడ్డాను. ఏమైతేనేం మీరిద్దరూ అన్నదమ్ములు. ఈ విశాల సామ్రాజ్యం మీ ఇద్దరిదీ. ఈ ప్రమాద స్థితిలో మీ ఇద్దరు అన్నదమ్ములూ ఏకం కాకపోతే మొగలాయీలకు దేశంలో నిలవనీడ ఉండదు.
అజ్జం: (అనుమానిస్తూనే) జీహాఁ అబ్బాజాన్.
ఔరంగ: కాంబక్ష్‌తో మాట్లాడాను. మీ అంతఃకలహాలు నాకు నచ్చటం లేదు. కావలసినంత ఫౌజు ఉంది, ఖజానా ఉంది, నమ్మక్ హరాములు కాని సమర్థులైన సరదారులు, మున్సబ్‌దారులు ఉన్నారు. అలంఘీరులు కండి! మీ కోసం కాకపోతే ఢిల్లీ దర్వాజా దాటి ఇంత వృద్ధాప్యంలో ఈ వ్యాధితో ఈ తంటాలు పడవలసిన స్థితి నాకేముంది. అవసరమైతే అన్నదమ్ములు పాలుపంచుకొని ఒకరు ఢిల్లీనుంచీ మరొకరు ధియోగర్ నుంచీ పాలించండి.
అజ్జం: (అదిరిపడ్డట్టు) ఏమిటి అబ్బాజాన్?
ఔరంగ: కాంబక్ష్‌తో మాట్లాడు.
అజ్జం: మాట్లాడే వచ్చాను అబ్బాజాన్.
ఔరంగ: అయితే నా అభిప్రాయం అతడు నీకు చెప్పాడన్నమాట.
అజ్జం: (ఆలోచనా పూర్వకంగా) ఔను!
ఔరంగ: ఆ ఖురాన్‌మీద నీ కైజారు ఉంచు... ఆలోచించకు... అచ్ఛా దేవాఁ బోత్.... ఉఁ కాంబక్ష్ మేరా భాయీ... దార్ ఉల్ ఇస్లాం... మేరా ఇరాదా...
ఏకాంకికలు
449