కుటుం: గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన కొందరు యువకుల్ని చేరదీసి, సేవాసంఘం స్థాపించాము. ఉడతాభక్తిగ ఎవరికి తోచిన త్యాగం వారిని చెయ్యమని ప్రార్థిస్తున్నాము. మీరూ మాకు మాట ఇవ్వాలి.
సుబ్బా: సాలోచనగా ఏమని?
కుటుం: మీ ఇరువురి శత్రుత్వాలను వదిలిపోవటమే మీ దగ్గరనుంచి మేమర్థించే త్యాగం. తప్పదు. వాగ్దానం చెయ్యండి.
సుబ్బా: (ఆర్ద్రకంఠంతో) గ్రామం బాగుపడుతుందంటే నేను అడ్డు వస్తానా? తప్పకుండా... అతడు అంగీకరిస్తాడని నేననుకోను.
కుటుం: ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. అదుగో ఆ వచ్చేది శ్రీమంతుగారేనా! శ్రీమంతుగారూ... ఒక్కమాట.
శ్రీమంతు: అక్కడికి రానులెండి. ఇలా తామే దయచెయ్యండి.
కుటుం: అలాకాదు, మీరు ఇక్కడికి వచ్చితీరాలి. చూస్తావేం పిలవ్వయ్యా సుబ్బారాయుడు.
సుబ్బా: రా అన్నయ్యా! అరుగుమీద కూర్చొని మాట్లాడుకుందాం.
కుటుం: శ్రీమంతుగారూ! ఈనాటినుంచీ మీరిద్దరూ సోదరులు. మనస్సులో మాలిన్యమంతా కడిగేసుకోవాలి. గ్రామక్షేమం కోసం మిమ్మల్ని యాచిస్తున్నాను.
శ్రీమంతు: అంతకంటె నాకు కావల్సిందేముంది? నేనెప్పుడూ సంసిద్ధమే.
సుబ్బా: నేనూ అంతే. అన్నయ్యా! ఇంట్లో పిల్లలంతా క్షేమంగా వున్నారా?
శ్రీమంతుడు: ఆఁ మదరాసు నుంచి రాత్రే వచ్చాను. మీ వదినకు జబ్బు కొంత నెమ్మదించింది. ఆసుపత్రిలో నుంచి ఇంకా ఆరు రోజులకు విడుదల చేస్తారు.
కుటుం: ఈనాటినుంచీ మన గ్రామ జీవితంలో ఒక నూతన ఘట్టం ఆరంభమైంది. శ్రీమంతుగారూ.. పెద్దల సహాయంతో పెద్దపని నెత్తికెత్తుకున్నాం. అన్ని రంగాల్లో గ్రామాన్ని ఒక దారికి తీసుకొద్దామని. గ్రామం స్థితిగతులు నానాటికీ తీసికట్టుగా ఉన్నవి. ఆహారానికి, వృత్తికీ, విద్యకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
ఏకాంకికలు
441