ముల్రాజ్: నా ప్రజలు సుఖిస్తారంటే ఈ ప్రాణాలను కూడా బలివ్వటానికి సంసిద్ధుణ్ణి...
మేఘసింగ్: ధన్యుణ్ణి. నాకు సెలవిప్పించండి. సమస్త విధాలా సంధికే యత్నిస్తాను. లేకపోతే గాని దండనీతికి దిగము - మమ్మల్ని ఆశీర్వదించండి.
ముల్రా: జయోస్తు
మేఘ: సెలవు
ముల్రా: రాయ్‌సింగ్, విన్నావా మా ప్రసంగమంతా?
రాయ్: మీ సంభాషణ విన్నంతసేపూ నా స్వప్నం సత్యమౌతుందని ఆనందించాను. మహేదాబీ ధార్మికురాలి అండ వుంటే అన్నీ అనుకూలిస్తవి.
ముల్రా: అయినా, అనూప్‌సింగ్, అంగీకరిస్తాడని నమ్మను. మన ఇద్దర్నీ విడదీయటానికి యత్నిస్తాడు.
(దూరం నుంచీ మహారాజరాయ్ సింగ్‌కు జై, మహామంత్రి అనూప్‌సింగుకు జై, అన్న నినాదాలు శంఖ కాహళ ధ్వానాలమధ్య వినిపిస్తవి)
రాయ్: (చిన్న నవ్వు) నన్ను సింహాసనాన్ని స్వీకరించమని కోరటానికి అనూప్‌సింగు సపరివారంగా వస్తున్నాడు.
ముల్రా: తప్పక అంగీకరించు నాయనా నాకింతకంటే కావలసినదేముంది? అయితే అతణ్ణి ప్రాణాయనగా నమ్మవద్దు. ఇందులోకూడా ఏదో గొప్ప ఎత్తు ఉంటుందని నా నమ్మకం.
రాయ్: మీరు మీ కక్ష్యలోకి వెళ్ళిపొండి. మా ప్రసంగాన్ని వినండి. సెలవు.
అనూప్‌సింగ్ : నమస్తే మహారాజా...
రాయ్: 'నమస్తే అనూప్' ఏమిటీ వింత సంబోధన?
అనూప్: స్వీకరించి ప్రజలను ఏలుకోవాలి.
రాయ్: నేను కారాగార బంధితుణ్ణి సింహాసన మెక్కడమేమిటి? దేశం కల్లోలంగా ఉన్న సమయంలో మీకే ప్రమాదం సంభవిస్తుందోనని క్షేమం కోసం బందీని చేశాను. క్షమించండి. రాజ్యభారాన్ని స్వీకరించండి.
రాయ్: తండ్రిగారు సజీవులై ఉండగా నేను రాజ్యం చేయుట ఆత్మధర్మ విరుద్ధం.
436
వావిలాల సోమయాజులు సాహిత్యం-2