Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బురా: మంత్రి రావల్‌కూ, అతని కుటుంబానికీ జరిగిన అన్యాయానికి తగ్గ ప్రతీకారాన్ని చెయ్యమని నా మనస్సు ప్రబోధిస్తున్నది.

మహే: ఈ ప్రబోధానికి అర్థమేమిటో గమనించావా? ఈ ఇంట్లో ఈ దేశంలో ఇక నీకు స్థానం లేదన్నమాట.

బురా: నాకేం భయంలేదు. అవసరమైతే దేశభ్రష్ణుణ్ణి కావటానికి వెనుదీయను. నీ దీవెన ఉంటే చాలు.

మహే: సెబాస్ బురావర్ ఏదీ ఇలారా... ఒక్కమాటు నన్ను కౌగిలించుకో... ఇంతటి సత్య ప్రియత్వమున్న ధర్మవీరుడవని ముందెన్నడూ నాకు తోచలేదు, తండ్రీ... ఆలయ ఘంటానాదం అవిగో... ఏకలింగజీ ఆలయ ఘంటికలు వినిపిస్తున్నవి. మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నాను. విజయోస్తు.

★★★

(పారా హుషార్ పారాహుషార్ అన్న కేకలు నింపాదిగా వినిపిస్తుంటవి)

ముల్రాజ్: రాయ్‌సింగ్ ఏకలింగజీ ఇంకా నన్నెన్నేళ్ళు ఇలా బ్రతకమని ఆజ్ఞాపించాడో నిద్రాహారాలు లేవు. ఈ కారాగారానికి నామీద దయ కలిగేటట్లు లేదు.

రాయ్‌సింగ్: ద్రోహిని. ఈ మీ ఆపదలన్నిటికీ కారణం నేను. మంత్రి రావల్‌ను హత్య చేస్తే నాకేదో ఒలికి పోతుందనుకున్నాను.

ముల్రా: ఆనాడు నీవు అనూప్‌సింగుతో కలిసి రావల్‌ను హత్య చేసినప్పుడు నన్ను కూడా పూర్తిచేస్తే ఎంతో బాగుండేది. నాకూ నీకూ ఇద్దరికీ ఈ కష్టాలు తప్పేవి.

రాయ: మీ శిరోవేదన ఎలా ఉంది?

ముల్రా: నా ప్రాణాలతోగాని అదీ పొయ్యేటట్టు లేదు. నాన్నా నన్ను కనికరించి ఒక్క గుక్కెడు విషం తెప్పించలేవూ?

రాయ: విషమా? ఆ మాట మళ్లీ ప్రస్తావిస్తే నన్ను చంపుకున్నట్లు పరమేశ్వరానుగ్రహం వల్ల మనకు మళ్ళీ మంచిరోజులు వస్తాయి.

★★★

మేఘ: అదుగో ఆ వీరుడు క్రమంగా దారి చేసుకుని, కారాగారంలో ప్రవేశించాడు. బహుశః మహారాజును, యవరాజును చెర విడిపించవచ్చు. మనం ఇక విడివడిపోదాం.


432

వావిలాల సోమయాజులు సాహిత్యం-2