Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సారంగదేవి : ఆ పానీయాన్ని నన్ను త్రాగనివ్వండి.

రాజు : (సకరుణంగా) తీసుకో తల్లీ!

(కజ్జల ఒక వెర్రికేక పెట్టి సారంగదేవి అందుకొని త్రాగబొయ్యే పానీయ పాత్రను చేతితో తీసుకొంటుంది)

కజ్జల : (వెర్రిగా చూస్తూ ఉన్న సారంగదేవితో) సారంగీ ఏమిటది?

సారంగదేవి : ఏమిటమ్మా అలా వెర్రికేక పెట్టావు - (కజ్జల ఒక గుక్కలో పానీయాన్నంతా తాగేస్తుంది)

కజ్జల : వెర్రి కేకా... అమ్మాయీ.

సారంగదేవి : (భయోద్వేగంతో) అమ్మా.

కజ్జల : ఏ... విషమ... పరిస్థితులు వచ్చినా నన్ను మోసగించకు.

సారంగదేవి : అమ్మా! నీ కోరికను ప్రాణమిచ్చైనా పరిపాలిస్తాను.

రాజు : కజ్జలా! ఏమిటా ఆయాసం.

కజ్జల : ఏది చూచినా నాకు వ్యతిరేకం! భగవదిచ్ఛే నాకు వ్యతిరేకం! నేను బలికావలసిందే కాని ప్రయత్నం నిష్ఫలం. జీవితం నిష్ప్రయోజనం (తూలి పడబోతుంది).

సారంగదేవి : (దగ్గరకు పోయి) అమ్మా! అమ్మా!! (పట్టుకొని నేలమీద పడుకోబెడుతుంది)

రాజు : కజ్జల, ఏమిటా దుస్థితి?

సారంగదేవి : అమ్మను మృత్యువు పిలుస్తున్నది నాన్నా!

రాజు : నేను మొదట త్రాగబోయింది విషమన్న మాట! ప్రభో నన్ను బ్రతికించావు.

కజ్జల : ప్రభూ! మీరు నా దుస్థితి చూస్తూ కూడా స్వార్థపరు లౌతున్నారా?

సారంగదేవి : (ఏడుస్తూ) అమ్మా! అమ్మా!!

కజ్జల : ఏడవకు తల్లీ - ఏడ్చి ఏం ప్రయోజనం?

(సారంగదేవి చేతులు ముద్దాడుతుంది)


ఏకాంకికలు

411