ఏ.క.తా.ర
కోప్పడకమ్మా! కోప్పడకు, నీవు తప్ప నాకు కలిగే అనుమానాలను తీర్చేవాళ్లు ఎవరమ్మా!
నాన్న చూతామా అంటే అంత చదువుకున్నా ఆ మార్వాడీ దగ్గర గుమాస్తా. నిమిషం
తీరిక లేదు. ఉదయం పోతే సాయంత్రం గాని ఇంటికి రారు. వచ్చిన తర్వాత బడలిక.
ఎప్పుడు చూచినా ఏదో కష్ట సముద్రంలో ఈదుతున్నట్లు ఉంటారు. ఇక
మాట్లాడించటానికి నాకు ఏమి మనస్కరిస్తుంది? అవకాశమూ ఉండదు. బళ్లో
చదువుకుంటున్నామన్నమాటేగాని మా అనుమానాలను తీర్చే గురువులు కారు వాళ్లు.
ఎందుకూ పనికిరాని విషయాలు ఎన్ని చెప్పినా ఫరవాలేదు. మేము ఏవన్నా ప్రశ్నలు
వేస్తే అప్రస్తుతమనీ, అధిక ప్రశంసనీ, ఇప్పుడు కాదనీ చేతగాక గర్వితనం వల్లా
తప్పించుకొంటూ ఉంటారు.
తల్లి : తప్పు! మేష్టర్లను నిందించకూడదు.
కొడుకు : (గడుసుగా) ఇక మాకు చెప్పేదెవరమ్మా మరి! మా భావాలను, జిజ్ఞాసను చంపుకోవలసిందేనా? మేమూ 'డూడూ వెంకన్నలము' ఐతే చూతామనేనా మీ అందరి అభిలాష... పోనీలే నీకేదైనా పని ఉంటే చూచుకో.
తల్లి : (కంటికి నీరు తిరిగి ఒక చుక్క బుగ్గమీద పడి చిందుతుంది) అంతలో ఆవేశము. అంతలో నైరాశ్యము. చెప్పుమరి ఏం కావాలో?
కొడుకు : నిమిషాల మీద అయ్యే జవాబులుండే ప్రశ్నలా! అన్నిటికీ సమాధానాలు చెప్పేంత వీలుంటే అడుగుతా! కాకపోతే మరొక తడవ అడుగుతాలే... (తదేక దృష్టి)
తల్లి : (ప్రేమార్ద్ర దృక్కులతో) పని కాలేదన్న విసుగులో ఏదో అన్నాను. దానికింత చింతామగ్నత ఎందుకు? తండ్రీ! నీ అనుమానాలను తీర్చకుండా నేను చేసే పనిమాత్రం ఏమి పాడైంది. నే చదువుకున్న చదువెందుకు! చట్టుబండలకా! మీ నాన్న వచ్చేటప్పటికి ఆ రెండు ఇళ్లూ చిమ్మి రెండు కప్పుల కాఫీ కాచలేక పోతానా!
కొడుకు : అమ్మా! అయితే అడగమంటావా?
ఏకాంకికలు
329