భదంతుడు : అమ్మా! అందుకనే భగవానుడన్నాడు.
'యేవా గరత్తాను పతంతి సోతం
సయం కతం మక్కట కోవ జాలం
పతంసి చేత్వ నవజంతి ధీరా
అనపేర్ధినో సబ్బ దుక్‌ఖం పహాయ'
ఉత్పల : భదంతా మీతో వెనుక ప్రసంగించిన ఆ ఉత్పలను నేనే! కడుపులో బడబాగ్నితో
నిత్యమూ నాగరకలోకానికి ఆనందా మృత ప్రదానం చెయ్యవలసిన ఆ ఉత్పలను
నేనే!!
(ఆరామ ఆలయంలో నుంచీ ఘంటికలు వినిపిస్తవి)
భదంతా! ఈ ఘంటికా నాదంలో ఎంత శీతలత్వమున్నది.
భదంతుడు : బుద్ధ పూజకు పిలుపు వినిపించింది.
ఉత్పల : (సోత్సాహంతో) ఈ ఆశ్రమ వాతావరణం ఎంత తాపా పనోదకంగా ఉంది.
అమితావి గొంతుక :
'నసంతి పుత్తా తాణాయ నపితా నపి బాంధవా
అంతకే నాధిపన్నస్య నవీథి జ్ఞాతిషు తాణతా
ఏతమత్ ఖవసం జ్ఞాత్వా పండితో సీల సంబుతో
నిర్వాణగమనం మగ్గగం ధిప్పామేవ విసోధయె'
ఉత్పల : భదంతా! అది అమితావి గొంతుకేనా? ఎంత అనునయంగా ఉంది
నందుని గొంతుక :
'కర్మ స్య కారకో నాస్తి
విపాకస్య చ వేదకో,
శుద్ధ ధర్మం ప్రవర్తంతి
యే వేదం సమదర్శనమ్'
ఎ.ఐ.ఆర్. హైద్రాబాద్ 7-6-1949
328
వావిలాల సోమయాజులు సాహిత్యం-2