Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందుడు: సంగీతమంటే మహానందము. ఆరామంలో సంగీత సాధన లుండకూడదని అగ్రశావికులు శాసించారు.

ఉత్పల : మరి ఈ వీణ...

నందుడు : ఇది లేనిది నేను బ్రతకలేనని గుర్తించి నా ఒక్కడికే అనుజ్ఞ ఇచ్చారు. అతిథులు యధేచ్ఛగా పాడుకోవచ్చును.

ఉత్పల : మీ వీణ చాలా పాతదే!

నందుడు : (దైన్యంతో) చాలా పాతది. పదేళ్ల క్రితం పాటలిలో ఒక ఉపాసిక నా చేత పాడించి సంతోషంతో ఇది సమర్పించింది. అమ్మా! అయితే నీవు ఈ పాతవీణ మీద పాడలేవా?

ఉత్పల : శక్తి కొద్దీ యత్నించి మిమ్మల్ని సంతోష పెట్ట ప్రయత్నిస్తాను. శ్రావకా! నేను ఏ పాట పాడినా మీరేమీ అనుకోవద్దు.

నందుడు : నీ ఇష్టం వచ్చిన పాట కానీ అమ్మా!


ఉత్పల : 'నడిపింపవా ఓ ప్రభూ! నీవు నా నావ,
            భారాలను దేవ! బరువు మ్రోయగ లేను నడిపింపవా ॥
            పొడుపుమల నెత్తాన
            పొలిచి తడబడి కాంతి
            విడివడెడు పొలిమేర
            నేదూర తీరాలకో... ॥నడిపింపవా॥


నందుడు : వీణ మంచిదైతే పాట ఇంకా ఎంతో బావుండేది. ఎక్కడ నేర్చుకున్నావు తల్లీ ఈ పాట?

ఉత్పల : చిన్నతనంలో కోపం వచ్చి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది.

నందుడు : పాపం!

ఉత్పల : బహుదూరం నడిచి నడిచి అలిసిపోయి ఓ సరస్సు దగ్గిర చెట్టు నీడన విశ్రమించాను. ఒక భిక్షువు అప్పుడు ఈ పాట పాడుతుంటే విని నేర్చుకున్నాను - ఈ గీతం ఈనాడు పాటలలో, మగధలో ఇంటింటా ధనికులైన తల్లులు పిల్లలకు నేర్పిస్తున్నారు.


ఏకాంకికలు

325