Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేణుతో కలిసి : ఓ దేశ సేవికా! ఓ మహానేవికా!!

చైతన్యం :


నీ ఆర్తి నిత్యమై
నీ కీర్తి సత్యమై
కలకాలమోదేవి
వెలిగెదవు - తారవై - ఓ దేశ సేవికా!


రేణు :


కనువిప్పు నీ చరిత
కమనీయ మధుమూర్తి
చైతన్యమౌ లోక
చరితలో నోజయా!


ఇద్దరూ : ఓ దేశనేవికా! ఓ మహాసేవికా!!

చైతన్యం : జయా! నీవల్ల జయం కలిగింది. కానీ నీవు లేక పోయినావు. నవచైతన్యం కోసం నీవు బలిపీఠమెక్కిన వీరవనితవు. నమస్తే!

(అందరూ నిష్క్రమిస్తారు)

(తెర)


డాక్టరు చైతన్యం

301