పంచమ దృశ్యం
(సేవాసమితి ఆఫీసులో హడావిడిగా అన్నీ విప్పి సర్దుతూ చంద్రశేఖరం 'నా గుండె
చీల్చిచూడన్నా అందులో నవభారతం బున్న దన్నా!' అనే పాట పాడుతూ భుజంగం
డ్రాయరు బద్దలుకొట్టి, జేబులో డబ్బు దాచిపెట్టి)
నాటకం! నాటకం!!
లోకమంత నాటకం!
పొద్దుకంటె ముందులేచి
పొడిచి పొలుచు బూటకం నాటకం...
ఎండ చూచి గొడుగు పట్టి
ఎప్పుడైన మారటం
రంగువేసి సింగరించి
రాజులాగ ఏలటం నాటకం...
తల్లక్రిందులైతె కొంత
తప్పుకోని జారటం
నాటకం! నాటకం!!
లోకమంత నాటకం!
పుణ్యకోటి : చంద్రంభాయీ! చంద్రంభాయీ!!
చంద్రశేఖరం : (తాపీగా) ఏం భాయిసాబ్, ఇలా కొట్టుకొచ్చావు, అర్ధరాత్రి!
పుణ్యకోటి : కొట్టుకోరావటమేమిటి? కొంప మునుగుతుంటే.
చంద్రశేఖరం : గబ్ రావో మత్ - మనం ఉమర్ ఖయ్యాము శిష్యులము. వెనక చెప్పాను కదూ, మన పాలసీ, మరిచిపోయినట్లున్నావు. మిన్ను విరిగి మీదపడ్డా మనం ఖుషీమైన్‌టైన్ చెయ్యాలి.
డాక్టరు చైతన్యం
283