Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేణు : (వెళ్ళి తలుపు తీస్తుంది)

ముసలయ్య : (గుడ్డిలాంతరుతో ఒక ఉత్తరం తీసుకొనివస్తాడు) బాబయ్యా!

(అందించి నిలుచోని చూస్తుంటాడు)

చైతన్యం : (ఆశ్చర్యంతో ఉత్తరం చూసి) 'జయ'

రేణు : మొన్న వ్రాసిన ఉత్తరంలో ఆమె బాధలు చెప్పుకుంటానన్నది. అందుకోసం వచ్చింది కామాలి.

చైతన్యం : ముసలయ్యా! ఒంటరిగా వచ్చిందా?

ముసలయ్య : వెంట భుజంగంగారి బుడే ఉన్నాడు - నిద్రపోతున్నారని చెప్పినా ఉత్తరం ఇప్పుడే ఇవ్వమని దీనంగా అడిగింది బాబూ!

చైతన్యం : ఆమెను లోపలికి పంపించు.

ముసలయ్య : ఆ సాయబును కూడానా?

చైతన్యం : ఆమె ఇష్టం.

(రేణు చూస్తున్న ఉత్తరాన్ని మళ్ళీ 'ఏదీ' అని అడిగి పుచ్చుకొని).

'తమతో నా మానసిక వ్యథను ఏకాంతంగా చెప్పుకుందామని వచ్చాను. అర్ధరాత్రి శ్రమకల్గించినందుకు క్షమించండి' - 'జయ'

రేణు : కొన్నాళ్ళబట్టి ఏదో వ్యథ అనుభవిస్తున్నట్లే ఉంది. మణెమ్మతో ఇప్పుడు మాటిమాటికీ కనిపించటంలేదు -

ఆ దుర్గంధంలో బ్రతకలేని మనస్వి కామాలి. అయితే మరి నేను...

చైతన్యం : నీవూ వుండవచ్చు.

రేణు : ఆమె ఏకాంతం కోరినప్పుడు నేనుండి కష్టపెట్టడం నాకు ఇష్టంలేదు.

చైతన్యం : మరి నీవు మా సంభాషణ వినాలి.

రేణు : అలా వినను

చైతన్యం : అయితే నామీద ఒట్టే!


274

వావిలాల సోమయాజులు సాహిత్యం-2