Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేణు : 'నా డబ్బుకూ - మీ డబ్బుకూ' భేదమేమిటి?

చైతన్యం : (ఆర్ద్రంగా) నీ ఔదార్యం, సేవానిరతి నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నవి, రేణూ! ఇటువంటి దేశసేవికలు ఎందరు ఉద్భవిస్తేనోగాని ఈ దేశం బాగుపడదు.

రేణు : మీరు నన్ను స్తుతిచేసి బాధపెడుతున్నారు. మీబోటి త్యాగమూర్తులు కంకణం కట్టుకుంటే ఎందరో సహృదయులైన యువతలు ముందంజ వేస్తారు.

చైతన్యం : రేణూ!

రేణు : డాక్టర్ బాబూ! (చైతన్యం 'అబ్బా' అనటం విని) మంచినీళ్ళు తెచ్చిపెట్టమన్నారా?

చైతన్యం : నేను తెచ్చుకుంటాను లే.

రేణు : (తీసుకోవచ్చి యిస్తుంది)

చైతన్యం : ఇంత తియ్యగా ఉన్నవేం? - మరో బావివా?

రేణు : ఈ తీపి మీ మనస్సులో ఉదయించింది. అదే బావివి.

చైతన్యం : ఔను - నీవు కూడా తాగిచూడు. నీకూ ఇంత తియ్యగా ఉంటవేమో

రేణు : (త్రాగి) నాకూ...

చైతన్యం : తియ్యగా...

రేణు : ఉన్నవి

(కిటికీవైపు నడుస్తూ)

ఓహో! శశికౌ జీవన వాసనలు

నెలరా, వన్నెల వెన్నెలలో

కలువకు వలపుల క్రొన్ననలూ

చైతన్యం : (రేణు నిలుచున్న చోటికి వచ్చి తల నిమురుతాడు)


కుముదిని ముగ్ధసుహాసములో
శశికౌజీవన వాసనలూ,
ఓహో! శశికౌ జీవన వాసనలూ -


(తలుపు చప్పుడు)


డాక్టరు చైతన్యం

273