చతుర్థ దృశ్యం
(డాక్టరు చైతన్యం రాత్రి 12 గంటల సమయంలో టైపు చేస్తూ వుంటాడు. రేణు
నింపాదిగా క్రిందిగీతం పాడుకుంటూ ఉంటుంది)
ఓహో, కోయిల పాడుమురా!
ఉద్ధృత పావక జ్వాలామాలిక!
వసంతకాలం మారినది,
అనంత గ్రీష్మ మ్మమరినది
కవి వని నిన్నే కోరెదరా,
గళఘంటా నినదమ్ములతో ఓహో కోయిల...
వెగటైనవి చెలుడా! నీ
విమల పంచమశృతులే
మేల్కొనవలె నిదురించే
మేలివనము లీయిలలో
ఓహో, కోయిల పాడుమురా!
ఉద్ధృత పావక జ్వాలామాలిక!
చైతన్యం : అప్పుడే ఈ గీతానికి ట్యూన్ చేశావా ఏమిటి? రేణూ! ఇది కవులను
ఉద్దేశించి వ్రాశాను.
రేణు : రేపు తప్పక పాడుతాను సభలో - ఇంకా మీకు నిద్ర రావటం లేదా? పన్నెండయింది.
చైతన్యం : పన్నెండే? - అయిపోయింది. (పూర్తిగా చుట్టి కాగితం బయటికి తీసి పని అయిపోయినట్లు నిట్టూరుస్తాడు)
రేణు : (దగ్గిరకు వచ్చి) ప్రతినిత్యమూ ఇంతవరకూ మేలుకొని పనిచేస్తే చాలా దెబ్బతింటారు.
డాక్టరు చైతన్యం
271