Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


    చేరువో కాక దూరమో తేరువడిని
    నిమిషమాత్రానఁ దెలియదు నిర్ణయింప.

సీ. చిలుక తొడ్డాలనుండి యొలికిన నీవార
         ధాన్యమ్ము లయ్యవే తరుల క్రింద,
    స్నిగ్ధమ్ము లీశిలల్ చెప్పెడి నింగు దీ
         ఫలములు వానిపై వచ్చిరంచు,
    విని మన శబ్దమ్ము విశ్వాసమున సైచి
         చెంగక నిల్చె కురంగ చయము,
    వల్కలాంచలముల వారి రేఖల చేత
         నేటిదారులు తెల్ప కెంక పడెడి,
    వాయు కలిత ఝరీవారిచేఁ దడిసిన
         పాదులఁ బెంపొందు పాదపములు

తే. క్రమ్మి యలమున ఘృతధూమ కాంతివలనఁ
    గిసల యావళి గోల్పోయెఁ గెంపు సొంపు
    దర్భకోసిన తలముల తలఁగి భీతి
    జల్లఁగా మేయు నవె హరిణ శాబకములు.


మధుప్రప

97