Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ. చెలువుగ వ్రాసి చిత్రమును జీవము నోసెనో యా విరించి
    చెలువగ, రమ్య రూపములఁ జేర్చి మనమ్ముననే సృజించెనో?
    మెలతుక, లేని రూపు పరమేష్ఠి కళాప్రతిభన్ దలంప యీ
    నెలతుక నాకుఁ దోచు తరుణీమణియైన యపూర్వ సృష్టిన్.

ఉ. తే రిటు వెంటఁబడ్డ మెడ త్రిప్పి యపార విలోకనంబు పెం
    పారఁగ నిల్పి, బాణభయభావము పైకొన మేను కుంచి, మో
    మారిన నోరు విప్పి, కబళార్ధకుశంబులు మార్గసీమలన్
    జారఁగ నింగిపై కెగయుఁ జయ్యనఁ జెంగుచు నేల నిల్వకన్.

ఉ. ఈ మహనీయమూర్తి హృదయేశున కీఁబడుదాక నియ్యెడం
    గాముని శక్తిఁ గీడ్పరచు గాఢతపో వ్రతదీక్ష నుండునా
    కోమలచారు నేత్రములకున్ సరివచ్చు మృగాంగనా సఖీ
    ప్రేమలఁ జూరఁంచు నటవిన్ కడుఁ బ్రీతి వసించు చుండునా?

చ. పలుకులఁ జేర్చి పల్కు నొక వాక్యము పల్కకయున్ననేమి?
    బలికిన వీనులొగ్గి వినుఁ బాయక పొందుచు నాభిముఖ్యము
    నెలఁతుక నాదు మోమునను నిల్పక యున్నను దృష్టి జాలమా
    కలికి మిటారి చూపుగమి కాంచఁగ నేగదు నన్యమెద్దియున్
    బలిసెను - మోము క్రొంజెమట వాడ్చెను గర్ణశిరీష పుష్పము
    కలఁగిన - పెన్నిటిన్ ముడుచుఁ గమ్రముగా నొక గేల దిద్దుచున్.

ఉ. ఆనని తావ్వలం జెలఁగు నద్భుత పుష్పము, గోటి త్రుంచుటల్
    లేని మనోజ్ఞ పల్లవము, లీలగఁ గ్రోలని పూవుదేనె, ము
    ల్లానని నూత్న రత్నము, మహాఘన పుణ్యఫలమ్ము వేధ యీ
    మానిని మంజురూప మహిమంబున కెవ్వని భోక్త సేసెనో?

తే. చిన్నదై మును పెయ్యెడ యున్న యదియొ
    గొప్పదై మదియె యెదకుఁ గూర్పునింపు,
    ఎడము గలుగుట విడివడి యేది తోఁచుఁ
    గలసి యున్నట్లుగా నదె గాను పించు.

తే. వక్రమౌ నెది చూడఁగాఁ బ్రకృతి చేతఁ
   నదియె సమరేఖయై తోఁచు నక్కజముగ


96

వావిలాల సోమయాజులు సాహిత్యం-1