తోచునయ్యవి నాకు నుత్కృష్ట ముగ్ధ
మధుర మోహన నవ మంజుమల్లికలుగ.
తే. రమణిరో! ఘన జఘన భారచ్చలాన
నెంత వేగాన పయనింప నిచ్చగొనిన
నమృతమును గొన త్రావ నా యక్షి యుగళి
నలసతల నావు నీ నడ కంజలింతు.
తే. పతుల కుయ్యిడి యిటు పిలువంగ నీవు
లేమ! వినెదను పిక కాకలీ స్వనమ్ము
భయమున వడుకు చిట నిలువంగ కలికి!
అలసి విద్యుల్లతా తన్వి నిలచినటుల నిన్ను. 33
తే. నన్ను చెఱవట్టి చెరపు వెన్నాడు చుండె
గంధ గజ మటుల నిడె మదాంధు డితఁడు,
వీరగంధర్వ హర్యక్ష విభవు లార!
ఈ మహాంభోధి నీదింప మీరు రారె!!
తే. ఒక్క యాడుకూయిని విని యోపలేక
ఊరకే యిటు తల్లడ మొందె దీవు?
కదన మన్న నన్నియు భయాక్రందనములె
ఎటుల నిలతు బృహన్నలా! ఇట్టులైన?
తే. ఊరకుండెదరేల నేఁ డుదిత బలులు
మీ రథః కృతారులు, దీన మిత్రులు గద
కాంత కివ్విధి నపకృతి కలుగు పిదప
కాల్పనా యోధు ఘనతలు? కడిగి రండు!
తే. నలువ రాణికి నెవరిపైఁ దలంపు లేదో
యామె వారిని మధుర నేత్రాంచలముల
నించుకేనియు వీక్షింప నిచ్చవడదు
ఆమె వలచినఁ దనుదానె యాశ్రయించు.
తే. నీదు శ్రద్ధకు, భావనా నిరతి కర్థి
సలిపెడి విముగ్ద గురుపూజనల కలరి
మధుప్రప
89