Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ. అదయిన జూపులు తోప కామశర సంహారమ్ములై మించి శా
    రద శంపాలలితాకృతిన్ జనెదు - నీరంధ్రమ్ములై క్రమ్ము నీ
    రద సమ్మోహ వినీల కేశరుచి జాలమ్ముల్ - తమః పుంజ సం
    పద లెల్లన్ దమి క్రుమ్మరించి యెద సంతప్తమ్ము గావించెడిన్.

ఉ. ఆతడు కీచకాగ్రజుని నాతని తమ్ముల గీటడంచి పె
    నీృతికి హేతుభూతుఁడయి పెల్లుకలంచిన భీమసేనుఁ డ
    త్యాతత బాహుదర్ప వివశాత్ము బకాసురుఁద్రుంచి లోకవి
    ఖ్యాతి గడించుకొన్న పవనాత్మఁజుఁ డాతడు మత్స్య భూపతీ!

సీ. కలికి బేడిసమీ కనులఁ గనొన్నచో
         పడతి! యేను నలకూబరుఁడ నౌదు
    కలకంఠరుతి దోషగాఁ బల్కు పల్కుచో
         యబలరో! నందనోద్యాన మగుదు
    కెరలు తేనియవాక కెమ్మోవిఁ దనుపుచో
         చాన! యమృత కలశమ్ము నౌదు
    నాగభోగిని వోలె నను కౌఁగిలించుచో
         తరుణి! యే నైరావతమ్ము నగుదు. 21

తే. స్వర్గమును వీడి వచ్చిన వనిత! నన్ను
    నింత దయఁజూపి దాసుగా నేలుకొమ్ము
    అన్య భువన సుదుర్లభంబైన యెల్ల
    త్రిదశలోకసుఖాల నర్చింతు నిన్ను.

ఉ. కొఁవ్వి ప్రియుండు నిన్ను సుమ కోమలి! కౌఁగిట ద్రోసి పుచ్చ నీ
    వివ్వసుధం చరించి సుఖియించుచు బుద్దులు సెప్పఁగోరి ఓ
    జవ్వని వచ్చితే - అమర శైవలినీ జలజాత మోహనా!
    ఎవ్వని కీయ నెంచెదవో యీవు మనోజ మహీపతిత్వమున్?

చ. చతురుఁడె యైన నా ముసలి - స్రష్ట సృజించిన మూర్తి యౌనె యీ
    యతివ? రతీద్వితీయుఁడు, ప్రియమ్మున దిద్దిన ముద్దుగుమ్మ, యా
    శత మఖు దేవియున్, రమయు, శైలసుతా వనితామ తల్లియున్
    రతియును సాటి వచ్చెదరె లక్షయుగాలు తపమ్ము చేసినన్?


మధుప్రప

87