Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ. దక్షిణాధిప మహా ధర్మోజ్వలుండౌచు
         తేజరిల్లెడు రాజరాజొకండు
    శతనాగ బలఘన శక్తి సంపత్తిచే
         పవను గెల్వఁగఁజాలు ప్రభువొకండు
    శక్రచాప ప్రభాతముఖ విభవుడై
         యఖిలాధికత నొప్ప నమరుఁ డొకఁడు
    ఆశ్వినేయ మనోజ్ఞు అధిక దర్పాన్వితుల్
         అరి నిషూదన చణులిరువురు, కడు

తే. నద్భుతాకృతులై మదీయానువర్తు
    లగుచు గంధర్వపతు లేవు రగ్గి ప్రియను
    నన్ను గాపాడుచుందురో యన్న! ఇట్టి
    వలపు మాను మేల? బ్రతుకఁ దఁలచె దేని.

మ. తరుణీ! ఏలనె, మత్పతుల్ భయదగంధర్వుల్, మహావీరు, లు
    ద్దురతేజుల్ గలరంచు నాడు నెదకెంతో భీతిఁ గల్పింప నీ
    వరలేకించుక పల్కె దోసి! ఘనబాహాటోపము నూప భీ
    కర యుద్ధావని నేను నిల్చినను స్వర్గ స్వామియిన్ గెల్చునే?

చ. నను సభలోన కీచకుఁ డనాథనుగాఁ గని భంగపెట్టఁగాఁ
    గని యవనీజమున్ బెరికిఁ గ్రక్కునఁ బైఁబడి చంపఁబోవఁ న
    త్యనితరశాంత చిత్తుండు, మహాత్ముఁడు, ధర్మజుఁ డడ్డు పెట్టకుం
    డిన మన గూఢవృత్తికి ఘటింపదె యాపద వాయునందనా?

    నెమ్మది నిచ్చు కొన్నటుల నేడిటు లర్పణ జేసి తీవు నా
    కమ్మవొ పారిజాత సుమహారము, నియ్యది క్రొత్త క్రొత్తయై
    కమ్మని తావులన్, కడిది కాంతులు విందులు వెట్టుచున్న దీ
    యమ్మగు దానమున్ దమి రచించిన మాలిని వీవెయుత్తరా! 10

చ. కొలదుల కంకుభట్టనఁగఁ గ్రుమ్మరు నాతఁడె ధర్మజుండు, మీ
    వలలుఁడు భీమసేనుఁడు, అపాకృత పౌరుషశక్తి యుక్తి నే
    లలిత కళాగురుండనయి లాస్యము నేర్పితి ఫల్గుణుండ ను
    జ్జ్వలులు కవల్ త్వదీయ హయశాసక గోగణ దక్ష శిక్షకుల్.


మధుప్రప

85