తో నొప్పెడు వేషముతో
నాట్య ముగ్ధ గమనమ్ముల
ఉజ్జ్వలాభినయ వీక్షల
అరుగుదెంచినారు భట్ట!
సభ సర్వం అద్భుత క
ళ్యాణ మందిర మ్మయినది.
సభకు దివ్యవాతావర
ణాన్ని కల్పనమ్ము చేయ,
సహకరించు వాద్యగాండ్ర
నలువిధమ్ము లయిన యట్టి
అభినయాల హెచ్చరించి
స్థానోచిత స్తోత్రాలతో
వాగ్దేవిని, [1]వరివస్యను
అన్య దేవతామూర్తుల
సంప్రార్థన చేసినారు
అనుభూతికి ఏమి తోచె
నో ఏమో అపుడు మీరు
చిత్రంగా "హరికథ విం
టార మీరు హరకథ విం
టారా” అని సభవారిని
ప్రశ్నిస్తే అప్పు డచటి
చమత్కారశీలి అయిన
ధనికు డొకడు దర్పంతో
"హరకథనే చెప్పండి.
నేటిదాన్ని బట్టి రేపు
హరికథ వింటామొ లేదొ
తేలుస్తా" మన్నాడు.
"చేతో ముద మొదవె నాకు
మీరు కోరినట్లు నేడు
హరకథనే చెప్పుతాను.
పరమశివుడు పార్వతినెటు
పరిణయమాడెనా తెలిపే
హరకథనే చెపుతా" నని
నిర్ణయించినారు మీరు
హర్షధ్వను లొనరించిరి.
—♦♦♦♦§§♦♦♦♦—
12 శ్రీ నారాయణదాసా
కథాకథన మహాదక్ష!!
గౌరీకల్యాణకథను
తాము ఇట్లు నడిపినారు
సతీదేవి శివునిపత్ని,
పతినిగాని, తననుగాని
తండ్రి అతడి యజ్ఞానికి
పిలువకపోయినను సోద
రీమణులను చూచుకోర్కె
తోడవచ్చె. దక్షు డపుడు
"జ్యేష్ఠపుత్రి నీవు నాకు
ఎపుడు నిన్ను పిలువనుగద
ఏల నీవు వచ్చినావు?
నా ఇంటికి? నీ పతిశివు
డన్యాయము చేస్తు నన్ను
నిరతమ్మును ద్వేషించును
కాన అతని పిలువలేదు,
సర్వదేవతల పిల్చితి.
యజ్ఞేశ్వరుడైన విష్ణు
వే ఈ కడ కరుగుదెంచు
వెళ్లిపొమ్ము. నీ విటను
న్నావొ శివుడె ఇటకు వచ్చు.
- ↑ వరివస్య = పూజ
________________________________________________________________________________
802
వావిలాల సోమయాజులు సాహిత్యం-1