కథజెప్పగ వచ్చినారు
నవ్యమార్గ సంవాసా!
ఓ నారాయణదాసా!!
—♦♦♦♦§§♦♦♦♦—
10 “కథాగానపుంస్కోకిల”,
నిత్య నవ్య మయూరమ్ము
పుంభారతి వచ్చినారు,
కథను జెప్ప నున్నా రను
[1]క్రమవిషయ మెరిగి నేను
ఆటభూమి నుంచి ఇంటి
కతివేగముగాను చేరి
దాసుగారి కథను నేను
వారి పాదములకడ నుప
విష్ణుడనై శ్రద్ధతోడ
వినగావలె సాయపడుడు
అని ప్రార్థన చేసినాను.
పురములోని విజ్ఞులలో
ప్రముఖులైన మేనయత్త
భర్తలైన మామగారు
నా ఆందోళనను చూచి
చేరబిల్చి చతురతతో
బుజ్జగించి "ఒరే యాజి!
సుప్రసిద్ధ నామధేయు
లైన వారి కథను వినగ
నేనూ ఒక శ్రోతనురా!
నీ కోరిక తీరుస్తా!!"
అంటు మాట యిచ్చినారు.
—♦♦♦♦§§♦♦♦♦—
11 తమ హరికథ కేర్పాటులు
చౌతరాలొ జరిగాయి.
వేలవేలమంది జనం,
పురములోనివారు, ప్రక్క
ఉన్న ఊళ్లలోని వారు
శ్రోతలుగా వచ్చి సభను
నింపినారు పరమభట్ట!
మిమ్ముగూర్చి పలువిధముల
విన్నయట్టి విజ్ఞానులు
సైతము మిము వీక్షింపగ
స్వాభిమాన దర్పంబుల
ఎట్లొ విడిచి, విడువకుండ
వచ్చి సభను చేరినారు,
స్థానమ్ముల పొందినారు.
శారదావతార! మీరు
పెద్దదయిన తలకొప్పును
దానిపైన రమ్య పుష్ప
గుచ్ఛమ్ములు, ఫాలభాగ
మున కుంకుమబొట్టు, కనుల
దిద్దుకొన్న కడు నల్లని
కాటుకయును, దేహము పై
లేపనాలు, చందనాది
గంధమ్ములు, అన్యమైన
అంగరాగ భోగమ్ములు
ఆభరణాలను ధరింప
కడు నపేక్ష, పురుషులపై
తమ్ము మోహపరచునట్టి
నైజ రమ్య లక్షణాల
వ్యాప్తినొందు సురభిళాల
- ↑ క్రమ = రమణీయమైన
___________________________________________________________________________________
ఉపాయనలు
801