Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది




ధార్మికశృంగారయుతం,
మహాభక్తి సంభరితం
భాస్వన్నవ విభవములకు
బంధుర సంశోధనలకు,
రమ్యరమ్య భావనలకు,
రజ్య[1] న్మధు భాషణలకు
చేతోభవ భావములకు
చిత్రచిత్ర వర్తనలకు
ప్రవిమల విశ్లేషణలకు
విదిత జనాకర్షణలకు
విలస న్నవ నిలయమ్ము
ఒక్క మహత్కార్యార్థం
ఒక్క నవ్య సృష్ట్యర్థం
మనసు నిశ్చయమ్ముచేసి
భారతి పుంరూపంతో
పుడిమిపైన ప్రవర్తింప
ఆదిభట్ట నారాయణ
మూర్తితోటి అవతరించి
అక్కార్యము నాచరించి
అద్భుతవిఖ్యాతి తోడ
తిరోగమన మొనరించిన
సత్య కథా కథనమ్ము!

—♦♦♦♦§§♦♦♦♦—

5   జన రంజన కర్మవీర
సర్వ దేశ పరీవార!![2]
సద్గుణగణ బహుభూషణ
ధర్మకర్మ రణభీషణ!!
ప్రౌఢ భక్తజన నేతా,
సజ్జనగణ సంత్రాతా!!
పరమభక్తి అగ్రగామి
జ్ఞానభూమి గోలోమీ[3]
అజ్ఞులయెడు దాక్షిణ్యత
విజ్ఞుల జేసెదవు వారి
క్షేత్రజ్ఞుడవైన నీకు
చిరు భక్తులపైన ప్రేమ
చేర్తు వారి వైకుంఠము
ఆదిభట్టు, వాగధిపతి,
అల్పజ్ఞుడ నైన నన్ను
విజ్ఞుని గావించెదవో!
మధురభక్తి సంభరితను
మానిని 'రాధను' జేతువా
నారాయణభట్ట! దిట్ట!!
నా నమస్సు లందుకొనుము
ఓహో, విజ్ఞానఖనీ!
ఆహహా! ఆనందవనీ
అమ్మా, ఓ వాగీశ్వరి!
అందుకొమ్ము వందనముల!
అందుకొమ్ము ఈ కాన్కల!

—♦♦♦♦§§♦♦♦♦—

6 . ఓ నారాయణ దాసా
ఓ దాసా! దాసదాస
నీవె స్వయంగాను వచ్చి
'స్వయంలేఖ' నాన్ని మాకు
వ్రాసి యిచ్చుకొన్నావు
శ్రద్ధతోటి, భక్తితోటి
నిష్ఠతో పఠియించినాను
అందు నీవు నిన్ను గూర్చి
శారదావతారుడ నని
తెలియ జెప్పుకున్నావు

  1. రజ్యత్ = శోభించుచున్న
  2. పరీవారుడు =సముదాయము కలవాడు
  3. గోవుల(పవిత్రమైన) తనూరుహములు (వెండ్రుకలు) గలవాడా

________________________________________________________________________________

798

వావిలాల సోమయాజులు సాహిత్యం-1